News November 14, 2024

నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరిన పోలీసులు.. సోమవారం విచారణ

image

TG: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని వికారాబాద్ కోర్టును కోరారు. మరోవైపు తనకు బెయిల్ కోరుతూ నరేందర్ రెడ్డి అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై కోర్టు సోమవారం విచారణ జరపనుంది. లగచర్ల కేసులో A-1గా ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Similar News

News November 26, 2025

IIIT-నాగపుర్‌లో ఉద్యోగాలు

image

<>IIIT<<>>-నాగపుర్‌ 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం పీహెచ్‌డీ ఉన్నవారికి రూ.65వేలు, మిగతావారికి రూ.60వేలు చెల్లిస్తారు. దరఖాస్తు చేసిన తర్వాత కాపీని recruitment@iiitn.ac.in ఈమెయిల్‌కు పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iiitn.ac.in.

News November 26, 2025

టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

image

AP: ఇటీవల ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.

News November 26, 2025

పలాశ్‌ను అన్‌ఫాలో చేసిన స్మృతి.. నిజమిదే!

image

కాబోయే భర్త పలాశ్ ముచ్చల్‌తో పెళ్లికి ముందు వేడుకల ఫొటోలను స్మృతి మంధాన డిలీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాలో అతడిని ఆమె అన్‌ఫాలో చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది అవాస్తవమని తేలింది. పలాశ్‌ను ఆమె ఫాలో అవుతున్నారు. స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో ఈ నెల 23న జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. పలాశ్ చాటింగ్ బయటపడటంతో పెళ్లి మొత్తానికే రద్దయిందంటూ SMలో ప్రచారం జరుగుతోంది.