News November 14, 2024

నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరిన పోలీసులు.. సోమవారం విచారణ

image

TG: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని వికారాబాద్ కోర్టును కోరారు. మరోవైపు తనకు బెయిల్ కోరుతూ నరేందర్ రెడ్డి అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై కోర్టు సోమవారం విచారణ జరపనుంది. లగచర్ల కేసులో A-1గా ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Similar News

News April 11, 2026

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.490 పెరిగి రూ.1,52,840కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.450 ఎగబాకి రూ.1,40,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News April 11, 2026

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

image

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.

News April 11, 2026

IRCTC చెన్నైలో 84 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

image

కాంట్రాక్ట్ పద్ధతిలో 84 హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల భర్తీకి IRCTC చెన్నైజోనల్ ఆఫీస్ నోటిఫికేషన్ ఇచ్చింది. BSc హాస్పిటాలిటీ&హోటల్‌ అడ్మినిస్ట్రేషన్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌&క్యాటరింగ్‌ సైన్స్, సంబంధిత విభాగాల్లో BSc/BBA/MBA చేసినవారు అర్హులు. నెలకు రూ.30,000 స్టైఫండ్‌గా ఇస్తారు. వయసు 27 ఏళ్లు ఉండాలి. APR- 25, 27, 28న ఇంటర్వ్యూలు ఉంటాయి. మరిన్ని వివరాలకు https://irctc.com/new-openings.php చూడండి.