News January 20, 2025
పవిత్రతో రిలేషన్‌పై నరేశ్ ఆసక్తికర కామెంట్స్

నటి పవిత్ర వచ్చాక తన జీవితం కాస్త మెరుగుపడిందని సినీ నటుడు నరేశ్ చెప్పారు. ఇప్పుడు లైఫ్ టైటానిక్ ఒడ్డుకు చేరినట్లుగా ఉందని తనదైన శైలిలో చమత్కరించారు. అర్థం చేసుకునే మనుషులు జీవితంలో ఉంటే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగిస్తామన్నారు.
Similar News
News February 11, 2025
మన్యం బంద్ నిర్ణయం వెనక్కి

AP: స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా చేపడుతున్న మన్యం బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 1/70 చట్టం అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన <<15427067>>హామీ<<>> ఇవ్వడంతో రేపు నిర్వహించతలపెట్టిన బంద్‌ను రద్దు చేస్తున్నట్లు నేతలు తెలిపారు.
News February 11, 2025
EVMల్లో డేటా డిలీట్ చేయొద్దు: సుప్రీంకోర్టు

EVMల్లో సింబల్ లోడింగ్ యూనిట్లు, మెమరీ తొలగింపు ప్రక్రియను వెరిఫై చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలన్న ADR పిటిషన్‌కు బదులివ్వాలని ECIని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనిఖీ జరిగేటప్పుడు EVMల్లో డేటాను చెరిపేయొద్దని లేదా రీలోడ్ చేయొద్దని సూచించింది. ‘ఎన్నికల తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే మెమరీ తొలగింపు లేదా మైక్రోచిప్ ట్యాంపర్ అవ్వలేదని ఇంజినీర్లు ధ్రువీకరించేందుకు వెరిఫికేషన్‌ను కోరుకుంటున్నాం’ అని తెలిపింది.
News February 11, 2025
స్టాక్‌మార్కెట్ల క్రాష్: 4 నెలల్లో ₹85లక్షల కోట్ల నష్టం

స్టాక్‌మార్కెట్లు పతనమవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద కనీవినీ ఎరగని విధంగా ఆవిరవుతోంది. గత SEP 27న నిఫ్టీ 26,277 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 3500 పాయింట్లు పడిపోయింది. అంటే 13% పతనమైంది. ఫలితంగా ఇన్వెస్టర్లు నవంబర్లో రూ.31L CR, డిసెంబర్లో రూ.10L CR, జనవరిలో రూ.27L CR, ఫిబ్రవరిలో రూ.15L CR మొత్తంగా సుమారు రూ.85 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.