News April 3, 2024
నరైన్.. ఏం కొట్టావయ్యా!!

సునీల్ నరైన్ మరోసారి బ్యాట్‌తో మ్యాజిక్ చేశారు. ఢిల్లీపై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అలరించారు. కేవలం 39 బంతుల్లోనే 85 రన్స్ చేశారు. 7 సిక్సర్లు, 7 ఫోర్లతో రఫ్ఫాడించారు. అంతకుముందు మ్యాచులో ఆర్సీబీపై 22 బంతుల్లోనే 47 పరుగులు చేశారు. ఈ ఆల్‌రౌండర్‌ను ఓపెనర్‌గా పంపాలన్న గంభీర్ నిర్ణయం గ్రాండ్ సక్సెస్ అయిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
Similar News
News April 18, 2025
విక్రమ్ ‘వీర ధీర శూర’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ హీరో విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం కానుందని తెలిపింది. అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించారు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా గత నెల 27న థియేటర్లలో విడుదలైంది.
News April 18, 2025
ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పడగొడతారా?: మంత్రి

TG: ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ KCR అనుచరులు పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి ఫైరయ్యారు. సంతలో కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారని, కానీ అది జరగదని స్పష్టం చేశారు. ములుగు(D) వెంకటాపూర్‌లో రెవెన్యూ సదస్సులో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్న పొంగులేటి.. పేదల కన్నీటిని తుడిచేందుకే భూ భారతి తీసుకొచ్చామన్నారు. గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా? అని ప్రశ్నించారు.
News April 18, 2025
TTD ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలి: సుబ్రహ్మణ్యస్వామి

AP: గోశాలలో గోవుల మరణంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. సీఎం చంద్రబాబు ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘టీటీడీ పాలన అధ్వానంగా ఉంది. గోవుల మరణం వెనుక కుట్ర ఉంది. టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఈ దారుణం జరిగింది. వయసు పెరిగి గోవులు చనిపోయాయంటున్నారు. మీరు చనిపోతే కూడా మిమ్మల్ని వదిలేయాలా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.