News March 29, 2024

రికార్డు సృష్టించనున్న నరైన్

image

KKR స్పిన్నర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఇవాళ ఆర్సీబీ‌తో జరిగే మ్యాచులో ఆయన 500 టీ20లు ఆడిన ఏకైక స్పిన్నర్‌గా నిలవనున్నారు. ఈ కరేబియన్ ప్లేయర్ ఐపీఎల్‌తో పాటు పలు లీగ్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఈ ఘనత అందుకున్న మూడో ప్లేయర్‌గా నరైన్ రికార్డులకెక్కనున్నారు. డ్వేన్ బ్రావో(573), షోయబ్ మాలిక్(542) ఈ జాబితాలో ముందున్నారు.

Similar News

News March 17, 2026

11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. మే 15 నుంచి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత విభాగంలో ITI/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. CBT 1, CBT 2, CBAT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/

News March 17, 2026

బొప్పాయి పంటకు గొంగళి పురుగు చేసే నష్టం

image

బొప్పాయిలో తొలి దశ నుంచే గొంగళి పురుగు ఉద్ధృతి ఎక్కువ. గోధుమ రంగు తల్లి రెక్కల పురుగులు ఆకు కింద, లేత కొమ్మలపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి 5,6 రోజుల్లో లార్వాలు వచ్చి ఆకు కింది భాగంలో పత్రహరితం గోకి తింటాయి. దీని వల్ల ఆకులు పండుబారి, గోధుమ రంగులోకి మారతాయి. బొప్పాయి పువ్వు లోపలి భాగాన్ని ఇవి తినడం వల్ల కాయల సంఖ్య తగ్గుతుంది. పిందెలను తినడం వల్ల కాయలపై మచ్చలు ఏర్పడి మార్కెట్‌లో ధర తగ్గుతుంది.

News March 17, 2026

రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

image

AP: రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో పాలకవర్గం గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గం ఏర్పడే వరకు వీరే పాలన చూసుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్‌కు జులై 29, మరో 13 పురపాలికల్లో నవంబర్ 21తో గడువు ముగియనుంది. అటు పంచాయతీల్లో APR 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.