News October 6, 2024
జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు రద్దు

అత్యాచారం కేసులో అరెస్టై, బెయిల్‌పై బయటికొచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అవార్డుకు ఎంపికైన కొద్దిరోజులకే ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. అవార్డు అందుకునేందుకు జానీకి కోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News March 25, 2026
చమురు వణుకుపుట్టిస్తోంది!

ప్రపంచంలో ఆయిల్ కొరత అతిపెద్ద సమస్యగా మారింది. గల్ఫ్‌తో పాటు ఇతర వనరులూ దాడులకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభానికి ప్రత్యామ్నాయం అనుకున్న రష్యన్ రిఫైనరీలూ ఇప్పుడు టార్గెట్‌గా మారాయి. ఇటీవల రష్యా రిఫైనరీలోని కోటి లీటర్ల స్టోరేజ్ ట్యాంక్‌పై ఉక్రెయిన్ దాడి చేసింది. మరోవైపు USలోని టెక్సాస్ రిఫైనరీలో పేలుడు సంభవించింది. ఫలితంగా గ్లోబల్ సప్లై చెయిన్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

అమరావతిలో అగ్నిప్రమాదాలు.. దర్యాప్తు ముమ్మరం

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై పోలీసు శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. CCTV ఫుటేజ్‌లను పరిశీలిస్తూ ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తోంది. ఇటీవల L&T కంపెనీ, తాజాగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పైపులు దగ్ధమైన సంగతి తెలిసిందే. అయితే అవి 130 డిగ్రీల వేడికి తప్ప చిన్న మంటలకు దగ్ధం కావనేది నిపుణుల అభిప్రాయం. కాగా వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉండొచ్చని <<19466902>>CM అనుమానం<<>> వ్యక్తం చేశారు.