News February 28, 2025
నేషనల్ సైన్స్ డే!

నేడు నేషనల్ సైన్స్ డే. 1928 FEB 28న శాస్త్రవేత్త సీవీ రామన్ భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన ‘రామన్ ఎఫెక్ట్’ను కనుగొన్నారు. ఈ పరిశోధనతో CVRను నోబెల్ అవార్డూ వరించింది. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 1987 నుంచి ఏటా సైన్స్ డేను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా’ థీమ్‌తో సైన్స్ డే జరుపుకుంటున్నాం.
Similar News
News November 21, 2025
అండమాన్‌లో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడవచ్చని పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో శనివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
News November 21, 2025
మూవీ ముచ్చట్లు

* ప్రభాస్ చాలా సున్నిత మనస్కుడు.. ఐ లవ్ హిమ్: అనుపమ్ ఖేర్
* DEC 5న జీ5 వేదికగా OTTలోకి ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ
* ‘కొదమసింహం’ రీ రిలీజ్.. వింటేజ్ చిరును చూసి ఫ్యాన్స్ సంబరాలు
* కిచ్చా సుదీప్ మహిళలను కించపరిచారంటూ కన్నడ బిగ్‌బాస్ సీజన్-12పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
* జైలర్-2 తర్వాత తలైవా 173కి కూడా నెల్సన్ దిలీప్ కుమారే డైరెక్టర్ అంటూ కోలీవుడ్‌లో టాక్
News November 21, 2025
ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM చంద్రబాబు

AP: రాష్ట్రంలో అందరికీ గృహాలు అందించేందుకు భారీ ప్రణాళికను రూపొందిస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించాలన్నారు. మూడేళ్లలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించేందుకు సర్వేను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వచ్చేలా కేంద్రంతో చర్చించాలని సూచించారు.


