News August 20, 2024
వైద్యుల రక్షణ కోసం నేషనల్ టాస్క్ఫోర్స్: SC

దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, వైద్య సంస్థల్లో వైద్యుల రక్షణకు నేషనల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. వైద్యుల రక్షణకు దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేలా వైద్య నిపుణులకు టాస్క్ఫోర్స్లో చోటు కల్పిస్తామని సీజేఐ బెంచ్ తెలిపింది.
Similar News
News November 11, 2025
నటి సాలీ కిర్క్ల్యాండ్ కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటి సాలీ కిర్క్ల్యాండ్(84) కన్నుమూశారు. డిమెన్షియాతో బాధపడుతున్న ఆమె పలుమార్లు కింద పడటంతోపాటు ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారు. 1987లో Anna చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె ఆస్కార్కు నామినేట్ అయ్యారు. 1968లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాలీ 200కు పైగా చిత్రాలు, టెలివిజన్ సిరీస్లలో నటించారు. గోల్డెన్ గ్లోబ్ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించారు.
News November 11, 2025
RBIలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

ఆర్బీఐలో 120 గ్రేడ్-B ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ఫేజ్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. <
News November 11, 2025
రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారా?

AFG క్రికెటర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. NEDలో జరిగిన ఈవెంట్లో రషీద్ ఓ అమ్మాయితో కనిపించగా ఫొటోలు వైరలయ్యాయి. దీనిపై రషీద్ స్పందిస్తూ ‘2025 AUG 2న నా లైఫ్లో కొత్త చాప్టర్ మొదలైంది. ఈవెంట్లో నాతో ఉన్నది నా భార్యే’ అని తెలిపారు. కాగా 2024 OCTలోనూ రషీద్కు మ్యారేజ్ అయినట్లు వార్తలు రావడంతో ఇది రెండో పెళ్లి అని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.


