News February 6, 2025
జాతీయవాదం సరికాదు: ఇన్ఫీ నారాయణ
పేదల సంక్షేమం కోసం పల్లెటూర్లకు వెళ్లి పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి విద్యార్థులకు పిలుపునిచ్చారు. చెన్నైలోని సాయి యూనివర్సిటీ కాన్వొకేషన్ ప్రోగ్రామ్‌లో మాట్లాడారు. దేశభక్తి కోసం జాతీయవాదాన్ని వదిలేయాలని సూచించారు. ‘దేశ, ప్రపంచ ప్రజలను మెరుగుపరిచేందుకు ఎంచుకున్న రంగంలో మనస్ఫూర్తిగా పనిచేయడమే దేశభక్తి. ఇంటర్ కనెక్ట్ అయిన ఈ ప్రపంచంలో జాతీయవాదాన్ని ఫాలో అవ్వడం సరికాదు’ అని ఆయన అన్నారు.
Similar News
News February 6, 2025
కరెంట్ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం
AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని మంత్రివర్గ సమావేశంలో తేల్చి చెప్పారు. అవకాశం ఉంటే తగ్గించాలన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. నూతన విద్యాసంవత్సరం మొదలయ్యేలోపే డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
News February 6, 2025
‘తల్లికి వందనం’పై సీఎం కీలక ప్రకటన
AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం)పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.
News February 6, 2025
SBI ఆదాయం ₹1.28L CR, లాభం ₹16K CR
డిసెంబర్ త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన SBI నికర లాభం రూ.16,791 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలోని రూ.9,164 కోట్లతో పోలిస్తే ఇది 84% పెరగడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.1,18,193 కోట్ల నుంచి రూ.1,28,467 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయం రూ.1,06,734 కోట్ల నుంచి రూ.1,17,427 కోట్లకు ఎగిసింది. గ్రాస్ NPA 2.42 నుంచి 2.07, నెట్ NPA 0.64 నుంచి 0.53 శాతానికి తగ్గాయి.