News July 11, 2024
చైనాకు నాటో వార్నింగ్

ఉక్రెయిన్‌పై పోరులో రష్యాకు సహకరించడం చైనా మానుకోవాలని నాటో దేశాలు హెచ్చరించాయి. రష్యాకు డ్రాగన్ మిలిటరీ సాయం అందించకున్నా మెరుగైన వాణిజ్య సంబంధాలను కొనసాగించిందని పేర్కొన్నాయి. మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి పరికరాలను చైనా అందిస్తుండటంతో రష్యాకు ఆయుధాల తయారీ సులభమవుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా సహకారం వల్ల ఐరోపా సహా రష్యా పొరుగు దేశాలకు ముప్పు పెరుగుతోందని తెలిపాయి.
Similar News
News December 31, 2025
కొత్త ‘ఉపాధి’ చట్టంపై 5న ప్రత్యేక గ్రామ సభలు!

AP: MGNREGA స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన VB-G RAM G పథకంపై అవగాహన కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. పంచాయతీల్లో ప్రత్యేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాల CSలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖలు రాసింది. దీంతో 5వ తేదీన రాష్ట్రంలో గ్రామసభలు నిర్వహించి, అవగాహన కల్పించాలని పంచాయతీ రాజ్ కమిషనరేట్ ఆదేశాలిచ్చింది. పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహించాలని అధికారులు సూచించారు.
News December 31, 2025
డాంగ్ టావో కోడి.. కేజీ మాంసం రూ.1.50 లక్షలు

‘డాంగ్ టావో’ వియత్నాంకు చెందిన కోడి. దీని ఆకారం చాలా వింతగా ఉంటుంది. ఈ కోడి పాదాలు కాస్త లావుగా ఉంటాయి. వియత్నాం రెస్టారెంట్లలో ఈ కోడి మాంసం చాలా స్పెషల్. ఇక్కడి ప్రజలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ కోడి మాంసాన్ని తినకపోతే తప్పుగా భావిస్తారు. అందుకే ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఈ కోడి మాంసాన్ని తింటారు. ఇంత డిమాండ్ వల్లే ఈ మాంసం కిలో దాదాపుగా రూ.1.50 లక్షలుగా ఉంటుంది. సీజన్ బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.
News December 31, 2025
నిమ్మకాయ దీపం వెలిగిస్తూ చదవాల్సిన మంత్రాలు..

‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’ అనే మంత్రం పఠిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ‘సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే’ శ్లోకాన్ని చదువుతూ దీపం వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయి. ఇవి మనసులో సాత్విక భావనను పెంచి, ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి శాంతిని చేకూరుస్తాయి. దీపారాధన చేసే సమయంలో ఏకాగ్రతతో అమ్మవారిని స్మరించడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది.


