News July 12, 2024

ఉగ్రవాదుల జాబితాలోకి నావల్నీ భార్య

image

కారాగారంలో మరణించిన దేశ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ భార్యను రష్యా ప్రభుత్వం ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఏ పోరాటం కోసమైతే తన భర్త ప్రాణాలు అర్పించారో ఆ పోరాటాన్ని కొనసాగిస్తానని యూలియా నావల్నయా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టుకు రష్యా వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఆమె దేశానికి వెలుపల జీవిస్తున్నారు. ఆమె రష్యాలో అడుగుపెడితే వారెంట్ దృష్ట్యా ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయొచ్చు.

Similar News

News February 19, 2025

జగన్‌కు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదు: షర్మిల

image

బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని AICC చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీకి వెళ్లి పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం YS జగన్‌కు, YCP MLAలకు లేదని విమర్శించారు. ‘నేరస్థులను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు’ అని ట్వీట్ చేశారు.

News February 19, 2025

100% మళ్లీ అధికారంలోకి వస్తాం: కేసీఆర్

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. తమ పార్టీ ఒక్కటే తెలంగాణ కోసం పోరాడగలదని, పార్టీ నేతలు ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్‌కు మాత్రమే తెలుసని చెప్పారు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని తెలంగాణ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 19, 2025

APPLY.. రూ.55,000 జీతంతో ఉద్యోగాలు

image

ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మార్చి 1 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. బీఈ/బీటెక్ చేసిన వారిని అర్హులుగా పేర్కొంది. రిజర్వేషన్‌ను బట్టి వయో సడలింపు ఉంది. శాలరీ గరిష్ఠంగా రూ.55,000 వరకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.ntpc.co.in.

error: Content is protected !!