News June 12, 2024
చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడికి ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. ‘మీ దార్శనికతతో కూడిన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని కచ్చితంగా నమ్ముతున్నా. మీ అందరికి విజయం చేకూరాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News March 24, 2025
పబ్లిక్ ఇష్యూకు Meesho

దేశీయ ఇ-కామర్స్ కంపెనీ Meesho పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. బిలియన్ డాలర్ల విలువైన IPO కోసం కొటక్ మహీంద్రా క్యాపిటల్, సిటీ బ్యాంకును లీడ్ బ్యాంకర్లుగా ఎంచుకుందని తెలిసింది. గత ఏడాది $3.9B గా ఉన్న విలువను 2.5 రెట్లకు పెంచి $10Bగా చూపాలని భావిస్తోంది. సేల్స్ పెరుగుతాయి కాబట్టి దీపావళి టైమ్‌లో లిస్టింగ్‌కు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అమెజాన్, ఫ్లిప్‌కార్టుకు మీషో బలమైన పోటీదారుగా అవతరించింది.
News March 24, 2025
సంచలనం.. రూ.50 కోట్ల క్లబ్‌లోకి ‘కోర్ట్’!

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్’ సినిమా సంచలనం సృష్టిస్తోంది. రిలీజైన 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.50.80 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. దాదాపు రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి భారీ లాభాలను పొందింది. థియేటర్ కలెక్షన్లతో పాటు శాటిలైట్, ఓటీటీ రైట్స్‌కు మరిన్ని లాభాలొచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News March 24, 2025
ప్రతి రైతునూ ఆదుకుంటాం: మంత్రి అచ్చెన్న

AP: వడగండ్ల వాన వల్ల నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. ‘ఐదేళ్ల పాటు రైతులను అన్ని విధాలా ఇబ్బందులు పెట్టిన మాజీ సీఎం <<15869360>>జగన్<<>> ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. మీ పాలనలో రైతులకు రాయితీలు లేవు. ఎరువులు సక్రమంగా అందలేదు. సూక్ష్మ సేద్యం లేదు. వ్యవసాయ యాంత్రీకరణ లేదు. అన్ని రకాలుగా రైతులకు నష్టం కలిగించింది వైసీపీ ప్రభుత్వమే’ అని ట్వీట్ చేశారు.