News July 15, 2024
చంద్రుడిపై నావిగేషన్.. చైనా ప్రణాళిక
భూమిపై ఉన్నట్లుగానే చంద్రుడిపైనా శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు చైనా సైంటిస్టులు ప్రణాళిక సిద్ధం చేశారు. మూన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు వీలుగా 4 కక్ష్యల్లో 21 ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2022లో జపాన్ శాస్త్రవేత్తలు కూడా చంద్రుడిపై 8 శాటిలైట్లతో లూనార్ నావిగేషన్ సిస్టమ్‌ను ప్రతిపాదించగా, ఆ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు.
Similar News
News October 16, 2024
ఓ వైపు వర్షం.. గ్రౌండ్‌లోనే కోహ్లీ
తొలి టెస్టులో సత్తాచాటేందుకు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వర్షం పడుతుండటంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణిస్తే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తానన్నట్లు ఆయన ఎదురుచూస్తున్న ఫొటో వైరలవుతోంది. వర్షంలోనూ తన కిట్‌తో గ్రౌండ్‌లో తిరుగుతూ కనిపించారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ మొదలుకావాల్సి ఉండగా వర్షం కారణంగా ఇంకా టాస్ కూడా పడలేదు.
News October 16, 2024
మగ బిడ్డకు జన్మనిచ్చిన రేణుకాస్వామి భార్య
కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రేణుకాస్వామి భార్య సహన మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉందని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. హీరోయిన్ పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపారని రేణుకాస్వామిని దర్శన్ అనుచరులు చిత్రహింసలకు గురిచేసి చంపారనే ఆరోపణలు దక్షిణాదిలో సంచలనం సృష్టించాయి. కాగా రేణుకా స్వామి మరణించిన సమయంలో సహన 5 నెలల గర్భిణి.
News October 16, 2024
ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?
దాదాపు రెండేళ్లుగా ఇద్దరు స్టార్లు బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఎట్టకేలకు వీరి సినిమాలు రిలీజ్ కానుండటంతో అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ (JAN 10), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో ‘పుష్ప-2’ (DEC 6) సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాల నుంచి సాంగ్స్, టీజర్స్ విడుదలయ్యాయి. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.