News January 3, 2025
వైజాగ్‌లో రేపు నేవీ డే విన్యాసాలు
AP: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేవీ రేపు విశాఖలో విన్యాసాలు చేయనుంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత నేవీ కృషికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డేను జరుపుతున్నారు. గత నెల 4న ఒడిశాలోని పూరీలో విన్యాసాలు నిర్వహించగా ఈ ఏడాది వాటి కొనసాగింపు వేడుకలు వైజాగ్‌లో జరగనున్నాయి.
Similar News
News January 25, 2025
జనవరి 25: చరిత్రలో ఈ రోజు
1918: రష్యన్ సామ్రాజ్యం నుంచి “సోవియట్ యూనియన్” ఏర్పాటు
1969: సినీ నటి ఊర్వశి జననం
1971: 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు
✰ జాతీయ పర్యాటక దినోత్సవం
✰ ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
✰ జాతీయ ఓటర్ల దినోత్సవం
News January 25, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 25, 2025
మాజీ సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత
TG: మాజీ సీఎం కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కొద్దిసేపటి కిందటే చనిపోయారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె కన్నుమూయగా, మృతదేహాన్ని ఓల్డ్ అల్వాల్‌లోని నివాసానికి తరలించారు. సకలమ్మ మృతిచెందడంతో సోదరుడు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.