News August 28, 2024

రాజ్యసభలో మెజార్టీ మార్క‌ును తాకిన ఎన్డీఏ

image

రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ మార్కును తాకింది. తాజా ఉపఎన్నికల్లో 12 స్థానాలకు ఎన్డీఏ+మిత్రపక్షాల అభ్యర్థులు 11 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో దాని బలం 112గా ఉంది. దీనికి తోడు ఆరుగురు నామినేటేడ్, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో 237 మంది సభ్యులు ఉండగా మెజార్టీ 119గా ఉంది. INDIA కూటమి బలం 85గా ఉండగా 27 మంది సభ్యులతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.

Similar News

News February 14, 2026

దివ్యాంగులకు ఫ్రీ బస్సు.. బడ్జెట్‌లో ప్రస్తావన

image

AP: రాష్ట్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ‘ఇంద్రధనుస్సు’ పేరుతో అమలు చేయనున్నట్లు బడ్జెట్ ప్రతుల్లో పేర్కొంది. కాగా ప్రస్తుతం దివ్యాంగులు 50% టికెట్ సబ్సిడీతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో వెల్లడించలేదు.

News February 14, 2026

తొందరపాటు నిర్ణయంతో 90% మంది ఫెయిల్: మంత్రి

image

AP: 2019-24 మధ్య సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టిన సంస్కరణలతో విద్యా వ్యవస్థ వెనుకబాటుకు గురైందని మంత్రి కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘తొందరపాటు నిర్ణయంతో 1,000 స్కూళ్లను CBSE విధానానికి మార్చడం వల్ల 90% మంది విద్యార్థులు పాస్ కాలేకపోయారు. టీచర్ల సన్నద్ధత లేకపోవడంతో “టోఫెల్” ఫెయిలైంది. పరిపాలనా వైఫల్యంతో “నాడు-నేడు”లో ₹7,875Cr మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలాయి’ అని వివరించారు.

News February 14, 2026

అమరావతిలో రూ.57,868 కోట్లతో పనులు: మంత్రి పయ్యావుల

image

AP: 2026 మార్చి నాటికి అన్న క్యాంటీన్ల సంఖ్యను 275కు పెంచుతామని మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 204 క్యాంటీన్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక పేద కుటుంబాలకు 25 లక్షల పట్టాలు/ఇళ్లను అందించి, సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో రూ.57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశామని వివరించారు.