News August 27, 2024
రాజ్యసభలో మెజారిటీ మార్క్ చేరుకున్న NDA
రాజ్యసభకు జరిగిన ఉపఎన్నికల్లో 9మంది BJP సభ్యులు సహా ఇద్దరు మిత్రపక్షాల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 245(8 ఖాళీలు) మంది సభ్యుల సభలో NDA మెజారిటీ మార్కు(119)ను చేరుకుంది. BJP బలం సొంతగా 96కి పెరగడంతో NDA బలం 112కు చేరుకుంది. అలాగే వీరికి 6 నామినేటెడ్, ఒక ఇండిపెండెంట్ సభ్యుడి మద్దతు ఉంది. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒకరు గెలవడంతో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 85కి చేరింది.
Similar News
News September 13, 2024
కోహ్లీతో రాధికా శరత్‌కుమార్ సెల్ఫీ
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణించిన ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ ఆయనతో సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘కోట్లాది మనసులను గెలుచుకున్న వ్యక్తి కోహ్లీ. ఆట పట్ల నిబద్ధతతో ఆయన మనల్ని గర్వపడేలా చేస్తారు. విరాట్‌తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది. సెల్ఫీ ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
News September 13, 2024
BREAKING: మరో అల్పపీడనం
AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైందని, క్రమంగా బలపడుతోందని తెలిపింది. రేపటికి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని ప్రకటించింది. కాగా ఇవాళ విశాఖలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వాన కురుస్తోంది.
News September 13, 2024
నందిగం సురేశ్‌కు పోలీస్ కస్టడీ
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు తీర్పిచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనను ఈనెల 5న హైదరాబాద్‌లో మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించడం లేదని, 8 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈనెల 15-17 వరకు 2 రోజులకే కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం సురేశ్ గుంటూరు జైలులో ఉన్నారు.