News January 19, 2025
NDRF సేవలు ప్రశంసనీయం: చంద్రబాబు

AP: NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ‘క్లిష్ట సమయాల్లో NDRF సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. విజయవాడ వరదల్లో వీరి సేవలు ప్రశంసనీయం. NIDM, NDRF క్యాంపస్‌కు 50 ఎకరాలు కేటాయించి, శంకుస్థాపన చేశాం. అమిత్ షా చేతుల మీదుగా రెండు క్యాంపస్‌లు ప్రారంభించాం. ఏ డిపార్ట్మెంటుకూ లేని శక్తి NDRFకు ఉంది. జపాన్, నేపాల్, టర్కీ విపత్తుల సమయంలో వీరి సేవలు అభినందనీయం’ అని తెలిపారు.
Similar News
News December 9, 2025
ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: డైరెక్టర్ మారుతి

‘బాహుబలి: ది ఎపిక్’ ప్రచారంలో హీరో ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్‌లో పర్యటిస్తున్నారు. అయితే నిన్న అక్కడ భారీ <<18509568>>భూకంపం<<>> సంభవించడంతో డార్లింగ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో డైరెక్టర్ మారుతి స్పందించారు. ‘నేను ప్రభాస్‌తో మాట్లాడాను. ఆయన సురక్షితంగా ఉన్నారు. ఆందోళన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
News December 9, 2025
టీవీని రిమోట్‌తో ఆఫ్ చేసి వదిలేస్తున్నారా?

రిమోట్‌తో టీవీని ఆఫ్ చేసినప్పటికీ ప్లగ్‌ని అలాగే ఉంచడం వల్ల నిరంతరంగా విద్యుత్తు వినియోగమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట TV ప్లగ్‌ను తీసేస్తే విద్యుత్ వృథాను తగ్గించవచ్చు. అలాగే ఇది షార్ట్ సర్క్యూట్ల ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. టీవీతో పాటు, సెట్-టాప్ బాక్స్‌లు, ఛార్జర్ల ప్లగ్‌లను కూడా అవసరం లేనప్పుడు తీసివేస్తే కరెంటు ఆదా అయి, బిల్లు తక్కువగా వస్తుందంటున్నారు. share it
News December 9, 2025
వంటింటి చిట్కాలు

* పాయసం చేసేటప్పుడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* అన్నం అడుగంటకుండా ఉండాలంటే దానిలో నెయ్యి, కాస్త నిమ్మరసం కలిపితే సరి. అన్నం తెల్లగా, పొడిపొడిగానూ అవుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* ఉల్లిపాయలను, బంగాళాదుంపలను విడివిడిగా పెట్టకపోతే తేమ కారణంగా రెండూ పాడవుతాయి.


