News January 19, 2025
NDRF సేవలు ప్రశంసనీయం: చంద్రబాబు

AP: NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ‘క్లిష్ట సమయాల్లో NDRF సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. విజయవాడ వరదల్లో వీరి సేవలు ప్రశంసనీయం. NIDM, NDRF క్యాంపస్‌కు 50 ఎకరాలు కేటాయించి, శంకుస్థాపన చేశాం. అమిత్ షా చేతుల మీదుగా రెండు క్యాంపస్‌లు ప్రారంభించాం. ఏ డిపార్ట్‌మెంటుకూ లేని శక్తి NDRFకు ఉంది. జపాన్, నేపాల్, టర్కీ విపత్తుల సమయంలో వీరి సేవలు అభినందనీయం’ అని తెలిపారు.
Similar News
News February 9, 2025
గిల్ ఉంటే రో‘హిట్’

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా వన్డేల్లో గిల్‌తో ఓపెనింగ్ చేసిన మ్యాచుల్లో హిట్ మ్యాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. గత ఎనిమిది ఇన్నింగ్సుల్లో 2 సార్లు సెంచరీ, 4 సార్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. ఇవాళ్టి మ్యాచులో 100 బంతుల్లో 136 పరుగులు నమోదు చేశారు.
News February 9, 2025
ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు

ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ విషయమై బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ, మంజీందర్ సింగ్, ఆశిష్ సూద్‌తో వీరు సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా సీఎం ఎంపికలో రచించిన వ్యూహాన్ని అనుసరించే అవకాశమున్నట్లు సమాచారం.
News February 9, 2025
శర్వానంద్ మూవీకి పవన్ కళ్యాణ్ టైటిల్?

శర్వానంద్ హీరోగా ‘SHARWA36’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘జానీ’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపిస్తారని సమాచారం. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. కాగా జానీ మూవీ 2003లో విడుదలై అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.