News August 3, 2024
నేడో, రేపో సాగర్ గేట్లు ఓపెన్?

నాగార్జున సాగర్‌కు భారీ వరద వస్తుండటంతో గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీశైలం నుంచి 5,28,411 క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తోంది. కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదుల్లో వరద పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టులోకి రోజుకు 40 టీఎంసీలకుపైగా ఇన్‌ఫ్లో రానుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలు కాగా 211 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Similar News
News April 3, 2026
ఐశ్వర్యరాయ్‌తో విడాకుల పుకార్లు.. అభిషేక్ ఏమన్నారంటే?

విడాకుల పుకార్లను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే తమను ఇన్నాళ్లు కలిపి ఉంచిందని అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఐశ్వర్యా రాయ్‌తో 18 ఏళ్ల వైవాహిక బంధం వెనుక ఉన్న రహస్యాన్ని ఆయన పంచుకున్నారు. తమ వైవాహిక జీవితం నిలబడటానికి ‘తీవ్రమైన అహం’ కారణమని అభిషేక్ చెప్పారు. అయితే ఇక్కడ ‘అహం’(Ego) అంటే గర్వం కాదని, బంధాన్ని కాపాడుకోవాలనే పట్టుదల &ఆత్మగౌరవం అని వివరించారు.
News April 3, 2026
ట్రేడ్ డీల్.. ₹కోటి వరకు కార్ల ధరలు తగ్గింపు!

గతేడాది జరిగిన ఇండియా, UK ట్రేడ్ డీల్ నేపథ్యంలో జాగ్వార్ లాండ్ రోవర్ కార్ల ధరలు తగ్గనున్నాయి. ఇంపోర్ట్ డ్యూటీ 110% నుంచి 30 శాతానికి పడిపోవడం, GST సర్దుబాటుతో ధరలను 13-25% వరకు కంపెనీ తగ్గించనుందని తెలుస్తోంది. UKలో బిల్ట్ చేసిన టాప్ వేరియంట్లపై ₹1.06Cr ఆదా అవుతుందని సమాచారం. రేంజ్ రోవర్ స్పోర్ట్SV ఎడిషన్ రేటు ₹2.75Cr నుంచి ₹2.35Crకు, 4.4 లీటర్ పెట్రోల్SV ధర ₹4.25 Cr నుంచి ₹3.19Crకు దిగిరానుంది.
News April 3, 2026
అమరావతిని మార్చాలనుకోవడం తుగ్లక్ పని: CBN

AP: అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంటు చట్టం చేస్తే దాన్ని మార్చేస్తామనడం ఏం రాజకీయమని CM CBN ప్రశ్నించారు. ‘రాజధానిని ప్రతిసారీ మారుస్తామంటే ఎలా? దీనికి అర్థం ఉంటుందా? అమరావతి అని పలకడం ఇష్టం లేకే ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి నేతలుండడం రాష్ట్ర దౌర్భాగ్యం. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని మార్చేందుకు అవకాశమే లేదు. అయినా అలా ప్రయత్నించడం తుగ్లక్ పనే అవుతుంది’ అని ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు.


