News August 3, 2024

నేడో, రేపో సాగర్ గేట్లు ఓపెన్?

image

నాగార్జున సాగర్‌కు భారీ వరద వస్తుండటంతో గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీశైలం నుంచి 5,28,411 క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తోంది. కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదుల్లో వరద పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టులోకి రోజుకు 40 టీఎంసీలకుపైగా ఇన్‌ఫ్లో రానుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలు కాగా 211 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Similar News

News September 10, 2024

సుప్రీం ఆదేశాల్ని బేఖాతరు చేసిన కోల్‌కతా వైద్యులు

image

ఈరోజు సాయంత్రానికల్లా విధుల్లో చేరాలన్న సుప్రీం కోర్టు అల్టిమేటంను కోల్‌కతా వైద్యులు బేఖాతరు చేశారు. విధుల్లో చేరని పక్షంలో క్రమశిక్షణా చర్యల్ని తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం చేసిన హెచ్చరికల్ని లైట్ తీసుకుని తమ నిరసనల్ని కొనసాగించారు. ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచారం విషయంలో వైద్యశాఖలో ముగ్గురు అగ్రస్థాయి అధికారుల రాజీనామాల్ని వారు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

News September 10, 2024

జియో రీఛార్జ్ ఆఫర్.. ఇవాళే లాస్ట్

image

రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం సందర్భంగా తెచ్చిన <<14033644>>ఆఫర్లు<<>> నేటితో ముగియనున్నాయి. రూ.899తో రీఛార్జ్ చేస్తే 90 రోజుల పాటు వాయిస్ కాల్స్‌, రోజుకు 2GB డేటాతో పాటు మరో 20GB అదనంగా వస్తుంది. 10 ఓటీటీలు, జొమాటో 3 నెలల గోల్డ్ మెంబర్‌షిప్ వస్తాయి. రూ.999తో 98 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఇక రూ.3,599తో 365 రోజుల పాటు రోజుకు 2.5GB డేటా లభిస్తుంది. పై 3 ప్లాన్లకు అన్‌లిమిటెడ్ 5G వాడుకోవచ్చు.

News September 10, 2024

13-04-2029: భూమికి అత్యంత సమీపానికి భారీ గ్రహశకలం

image

అంతరిక్షం నుంచి భూమివైపు దూసుకొస్తోన్న ఓ భారీ గ్రహశకలాన్ని ఇస్రో పర్యవేక్షిస్తోంది. దీనిని ఈజిప్ట్ దేవుడు ‘అపోపిస్’ పేరుతో సైంటిస్టులు పిలుస్తున్నారు. 2029 ఏప్రిల్ 13న భూమికి కేవలం 32,000 కిలోమీటర్ల సమీపంలో ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రహశకలం 340-450 మీటర్ల వ్యాసం ఉంటుందని తెలిపారు. 300 మీటర్ల కంటే పెద్దదైన గ్రహశకలం ఢీకొడితే ఓ ఖండం నాశనమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.