News August 13, 2024
నీరజ్ చోప్రా సంపాదన, ఆస్తులు ఇవే!
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో ₹50లక్షల ఖరీదైన వాచ్ ధరించినట్లు ఫొటోల్లో కనిపించింది. దీంతో అతడి ఆస్తి, సంపాదన ఎంతనే చర్చ మొదలైంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం నీరజ్ నికర ఆస్తులు సుమారు ₹37కోట్లు. నెలకు సగటున ₹30 లక్షలు, ఏడాదికి సుమారు రూ.4 కోట్ల ఆదాయం అని తెలుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిచాక నీరజ్‌కు ప్రభుత్వ ప్రోత్సాహకాలు భారీగా అందుతున్నాయి.
Similar News
News September 18, 2024
పండగ ముందు సామాన్యుడికి షాక్.. రూ.170కి చేరిన వంట నూనె
వంట నూనె ధరలు పెరగడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు రెండు రోజుల వ్యవధిలోనే లీటర్‌కు రూ.15-20 పెరిగాయి. పిండి వంటలకు ఎక్కువగా ఉపయోగించే వేరుశనగ నూనె గరిష్ఠంగా రూ.170కి చేరింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు.
News September 18, 2024
Stock Market: ఐటీ షేర్లు విలవిల
స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఐటీ సూచీ 2% మేర పతనమవ్వడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడమే ఇందుకు కారణం. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత నిర్ణయం వెలువడే వరకు సూచీల గమనం ఇంతేనని విశ్లేషకులు అంటున్నారు. BSE సెన్సెక్స్ 83,138 (+26), NSE నిఫ్టీ 25,427 (+10) వద్ద ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫీ, టీసీఎస్, LTIM, విప్రో షేర్లు విలవిల్లాడుతున్నాయి. హీరోమోటో 3% వరకు పెరిగింది.
News September 18, 2024
రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా సాయం చేస్తున్నాం: సీఎం
AP: రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ వరదల సమయంలో 10 రోజులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌నే సచివాలయంగా మార్చుకుని పనిచేశామని, నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ ఇవ్వని స్థాయిలో సాయం చేస్తున్నామని ట్వీట్ చేశారు. బాధితులకు ఇచ్చే పరిహారానికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు.