News August 13, 2024
నీరజ్ చోప్రా గాయం ఇదేనా..?
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు హెర్నియా కారణంగా గజ్జల్లో గాయమైనట్లు సమాచారం. ఈ గాయం పరిశీలన కోసమే జర్మనీ వెళ్లారు. పేగులు బయటికి పొడుచుకురావడాన్ని హెర్నియాగా వ్యవహరిస్తారు. అవి పొట్ట కింది భాగంపై ఒత్తిడి చేయడంతో అక్కడి నుంచి గజ్జల్లో కండరాలపై ఒత్తిడి పడి గాయం అవుతుంటుంది. చాలాకాలంగా ఉన్న ఈ సమస్య కారణంగానే పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారని తెలుస్తోంది.
Similar News
News September 17, 2024
హెజ్బొల్లా పేజర్లు వాడకం వెనుక కారణాలు?
పుష్పలో అల్లు అర్జున్ ఉపయోగించే పేజర్ గుర్తుందా? వాటి కంటే అత్యాధునికమైనవి వాడుతోంది లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ను ఇజ్రాయెల్ సులభంగా హ్యాక్ చేయగలదని ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం పేజర్లను వాడుతోంది. రక్షణ సంబంధిత సాంకేతికత అంశాల్లో ఇజ్రాయెల్ శత్రుదుర్భేద్యంగా ఉంది. అందుకే <<14127059>>వేలాది పేజర్లు ఒకే రోజు పేలడం<<>> వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని హెజ్బొల్లా ఆరోపిస్తోంది.
News September 17, 2024
స్త్రీ ఒక శక్తి అని గుర్తుంచుకోవాలి: నటి ఖుష్బూ
మహిళ మౌనాన్ని తేలికగా తీసుకోవద్దని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ అన్నారు. చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె స్పందించారు. ‘స్త్రీ వ్యక్తిత్వాన్ని చూసి బలహీనురాలిగా భావించొద్దు. ఆమె ఒక శక్తి అని గుర్తుంచుకోవాలి. మహిళల్ని వేధించేవారు, అసభ్యంగా మాట్లాడేవారు ఆమె నేర్పే పాఠాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఆమె గురించి ఒక్క మాట మాట్లాడాలన్న వణుకుతారు’ అని వ్యాఖ్యానించారు.
News September 17, 2024
రేవంత్ ధర్మం తెలిసినవాడు: రాజాసింగ్
TG: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు బాగున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందించారు. ‘పోలీసులు, మున్సిపల్ సిబ్బంది పనితీరు బాగుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు అన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడం సంతోషకరం. రేవంత్ ధర్మం తెలిసినవాడు’ అని వ్యాఖ్యానించారు.