News July 20, 2024

నీరజ్ చోప్రా ఒలింపిక్స్ ట్రైనింగ్ ఖర్చు రూ.5.72 కోట్లు?

image

భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ ట్రైనింగ్ కోసం కేంద్రం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. నీరజ్ శిక్షణ కోసం రూ.5.72 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. అలాగే బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ట్రైనింగ్ కోసం రూ.3.13 కోట్లు, రెజ్లర్ వినేశ్ ఫొగట్ శిక్షణ కోసం రూ.70.45 లక్షలు ఖర్చు చేసినట్లు ఓ వార్తా పత్రిక ప్రచురించింది. ప్రస్తుతం వీరంతా పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నారు.

Similar News

News December 12, 2024

రాహుల్.. ఫోన్ బ్యాంకింగ్ బాగోతం గుర్తులేదా: నిర్మలా సీతారామన్

image

ప్రభుత్వ బ్యాంకులను కాంగ్రెస్ ATMsగా ట్రీట్ చేసిందని FM నిర్మల అన్నారు. ‘ఫోన్ బ్యాంకింగ్’తో ఉద్యోగులను ఒత్తిడిచేసి తమ క్రోనీస్‌కు లోన్లు మంజూరు చేయించిందన్నారు. ‘2015లో మేం చేపట్టిన సమీక్షలో ఫోన్ బ్యాంకింగ్ బాగోతం బయటపడింది. NPAలతో గడ్డకట్టుకుపోయిన బ్యాంకింగ్ వ్యవస్థను నిధులిచ్చి మోదీ ప్రభుత్వమే కాపాడింద’న్నారు. సంపన్నులకు PSBలు ప్రైవేటు ఫైనాన్షియర్లుగా మారాయన్న రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు.

News December 12, 2024

నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎవరైనా తరగతులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా తిరుపతిలో ఇవాళ భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News December 12, 2024

కాసేపట్లో అవంతి ప్రెస్‌మీట్.. కీలక ప్రకటన చేసే అవకాశం!

image

AP: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఆయన YCP కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌మీట్‌లో అవంతి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.