News June 27, 2024
నీట్ పేపర్ లీకేజీ.. ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ

నీట్-యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. బిహార్‌లోని పట్నాకు చెందిన మనీశ్ ప్రకాశ్, అశుతోశ్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నీట్ పేపర్ లీకేజీలో మనీశ్‌ను ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. మనీశ్‌కు అశుతోశ్ సాయం చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వీరిద్దరిని అధికారులు విచారించనున్నారు.
Similar News
News February 12, 2025
అధికారులు ప్రతినెలా 3-4 జిల్లాల్లో తిరగాలి: సీఎం

AP: గ్రూప్-1 అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నుంచి ప్రతి నెలా 3-4 జిల్లాల్లో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్లే అంశంపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలని సూచించారు. ఒక్కొక్క ఉన్నతాధికారి ఒక్కో జిల్లాను దత్తత తీసుకోవాలని పేర్కొన్నారు.
News February 12, 2025
మంచి మాట – పద్యబాట

లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
భావం: శారీరకంగా బలంగా ఉన్నవాడికంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా మచ్చిక చేసుకుని దానిమీదకు ఎక్కగలడు.
News February 12, 2025
నన్ను రాజకీయాల్లోకి లాగకండి: విశ్వక్

తనను, తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని విశ్వక్‌సేన్ నెటిజన్లను కోరారు. తాను మిడిల్ ఫింగర్ చూపిస్తున్న పోస్టర్ నెల రోజుల క్రితం విడుదలైందని, రెడ్ సూట్ ఫొటో కూడా ఇప్పటిది కాదని చెప్పారు. ‘ప్రతీసారి తగ్గను. కానీ నిన్న మనస్ఫూర్తిగా <<15423495>>సారీ<<>> చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. శాంతంగా ఉండండి. అసభ్య పదజాలం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లైలాను బాయ్‌కాట్ చేయాలన్న ఆలోచనను బాయ్‌కాట్ చేయండి’ అని X పోస్ట్ పెట్టారు.