News December 30, 2024

మొదలైన నీట్ పీజీ ప్రవేశాల ప్రక్రియ

image

TG: రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీజీ వైద్య సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు మొదలయ్యాయి. రేపటి వరకూ ఫస్ట్ స్టేజీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కన్వీనర్ కోటా సీట్లను ముందుగా భర్తీ చేయనున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదవకుండానే పీజీ కోసం దరఖాస్తు చేసుకున్న 34మందిని వర్సిటీ అనర్హులుగా ప్రకటించింది.

Similar News

News July 6, 2025

జులై 6: చరిత్రలో ఈరోజు

image

1901: భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జననం
1930: ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం(ఫొటోలో)
1985: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ జన్మదినం
1986: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం మరణం
2002: వ్యాపారవేత్త ధీరుభాయ్ అంబానీ మరణం

News July 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 6, 2025

జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రంలోని జడ్జీలందరికీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘SM పోస్టుల కేసుల్లో ఆర్నేష్‌ కుమార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ కేసు తీర్పులో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడంలేదు. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ(3-ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో)పై FIRలు నమోదుకు ముందు కచ్చితంగా విచారణ జరగాలి. 14 రోజుల్లోగా విచారణ చేయాలి, అందుకు DSP అనుమతి పొందాలి’ అని స్పష్టం చేసింది.