News July 5, 2024

నీట్ పీజీ పరీక్ష తేదీ ప్రకటన

image

నీట్ పీజీ 2024 పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్లు NBEMS ప్రకటించింది. రెండు షిప్టుల్లో పరీక్ష జరుగుతుందని, పూర్తి వివరాలకు https://natboard.edu.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది. నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనడంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Similar News

News July 8, 2024

కోపా అమెరికా: బ్రెజిల్‌‌కు షాక్

image

కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 16 టీమ్స్ పాల్గొనగా నాలుగు జట్లు సెమీస్ చేరాయి. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో బ్రెజిల్‌పై పెనాల్టీ షూటౌట్‌లో 4-2 గోల్స్ తేడాతో ఉరుగ్వే నెగ్గింది. అర్జెంటీనా, కెనడా, ఉరుగ్వే, కొలంబియా సెమీస్ చేరాయి. విజేతగా నిలిచిన జట్లు ఈ నెల 15న ఫైనల్ ఆడనున్నాయి. ఓడిన జట్లు ఈ నెల 14న మూడో స్థానం కోసం పోటీ పడతాయి.

News July 8, 2024

ప్రతి తిరస్కరణ ఆశీర్వాదం అని తెలుసుకుంటారు: ప్రశాంత్ వర్మ

image

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అసంతృప్తితో చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రతి తిరస్కరణ ఓ ఆశీర్వాదం అని మీరు ఒక రోజు తెలుసుకుంటారు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది కచ్చితంగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ఉద్దేశించే చేశారంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ తన తదుపరి చిత్రం ‘రాక్షసుడు’ను రణ్‌వీర్‌తో తీయాలనుకోగా.. విభేదాలు రావడంతో తాజాగా క్యాన్సల్ అయిన విషయం తెలిసిందే.

News July 8, 2024

కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకానికి ప్రభుత్వ ఉత్తర్వులు

image

TGలో కార్పొరేషన్ల ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా విడుదలయ్యాయి. 35 మందిని నియమిస్తూ మార్చి 15నే జీవో రిలీజ్ చేయగా, ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆగిపోయాయి. విత్తనాభివృద్ధి- అన్వేష్ రెడ్డి, రాష్ట్ర సహకార సంఘం- మోహన్ రెడ్డి, కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్- జంగా రాఘవ్ రెడ్డి, ఫిషరీస్ సొసైటీస్- మెట్టు సాయి కుమార్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా కాసుల బాలరాజును నియమించింది.