News January 16, 2025
పెన్&పేపర్ పద్ధతిలో NEET UG పరీక్ష

NEET UG పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పరీక్షను పెన్&పేపర్(OMR) పద్ధతిలో కండక్ట్ చేస్తామని ప్రకటించింది. పరీక్షను ఒకే రోజున ఒకే షిఫ్టులో నిర్వహిస్తామని తెలిపింది. 2019 నుంచి నీట్(UG) పరీక్షను NTA నిర్వహిస్తోంది. గతేడాది ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News November 28, 2025
మిరపలో మొవ్వుకుళ్లు తెగులు లక్షణాలు

మొవ్వుకుళ్లు తెగులు ఆశించిన మిరప మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై వలయాలుగా మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. మొవ్వుకుళ్లు తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువవుతుంది. నీటి ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది
News November 28, 2025
మిరపలో మొవ్వుకుళ్లు తెగులు నివారణ ఎలా?

మిరపలో మొవ్వుకుళ్లు తెగులుకు కారణమయ్యే తామర పురుగు నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2ml లేదా స్పైనోశాడ్ 0.25ml లేదా అసిటామిప్రిడ్ 0.2గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3mlలలో ఒక దానిని కలిపి పిచికారీ చేయాలి. గట్లమీద కలుపు మొక్కలు వైరస్‌లకు స్థావరాలు. వీటిని పీకి నాశనం చేయాలి. వైరస్ సోకిన మిరప మొక్కలను కాల్చివేయాలి. పొలం చుట్టూ 2 నుండి 3 వరుసల సజ్జ, జొన్న, మొక్కజొన్నను రక్షణ పంటలుగా వేసుకోవాలి.
News November 28, 2025
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ ఫండ్స్.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. CCT కింద బ్లడ్, ఐ బ్యాంక్‌ను 27 ఏళ్లుగా చిరంజీవి నిర్వహిస్తున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం విదేశీ విరాళాలు తీసుకునేందుకు FCRA అనుమతి కోరుతూ ట్రస్ట్ చేసిన అభ్యర్థనకు కేంద్రం అంగీకారం తెలిపింది. ట్రస్ట్ సేవలు విస్తృతమవుతాయని మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


