News January 24, 2025
NEFT/RTGS సిస్టమ్ హ్యాక్: సైబర్ నేరగాళ్ల బ్యాంకు దోపిడీ

కర్ణాటక విజయనగరలో డిజిటల్ దోపిడీ జరిగింది. బళ్లారి కోఆపరేటివ్ బ్యాంకు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు కొట్టేశారు. బ్యాంకు NEFT/RTGS లావాదేవీల వ్యవస్థను లక్ష్యంగా ఎంచుకొని హ్యాకింగ్ చేశారు. కస్టమర్ల అకౌంట్ నంబర్లు, IFSC కోడ్స్‌ను మ్యానిపులేట్ చేశారని తెలిసింది. జనవరి 10న జరిగిన ఈ దోపిడీపై FIR నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 16, 2025
ఆ లోపే బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక: కిషన్ రెడ్డి

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీకి బీఆర్ఎస్తో కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత సంబంధం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
News February 16, 2025
హార్ట్ బ్రేకింగ్ PHOTO.. చిట్టితల్లికి ఎంత కష్టమో!

రూ.లక్షల కోట్ల బడ్జెట్. కోట్లాది మంది ఉద్యోగులు, పోలీసులు. లేటెస్ట్ టెక్నాలజీ. అయినా మన దేశంలో సాధారణ ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదు. నిన్న ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట తర్వాత సగటు భారతీయుడి ఆవేదన ఇది. కాలు పెట్టేందుకు కూడా చోటు లేని రైల్లో తన కూతురిని జాగ్రత్తగా ఎత్తుకున్న తండ్రి ఫొటో చూస్తే గుండెలు బరువెక్కుతున్నాయి. ఆ రద్దీ, తోపులాటకు తాళలేక ఆ పసిపాప గుక్కపెట్టి ఏడుస్తోంది.
News February 16, 2025
రేవంత్ ఢిల్లీకి వెళ్లేది అందుకే : కిషన్ రెడ్డి

TG: దేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో అటెండెన్స్ వేసుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ డైరక్షన్ లోనే రేవంత్ ప్రధానిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల భర్తీ తప్ప.. కాంగ్రెస్ ఇచ్చిన కొత్త ఉద్యోగాలేమి లేవని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.