News November 19, 2024

చర్చలు సఫలం.. షెడ్యూల్ ప్రకారమే డిగ్రీ పరీక్షలు

image

TG: ప్రైవేట్ డిగ్రీ కాలేజీల <<14648546>>యాజమాన్యాలతో<<>> విద్యాశాఖ చర్చలు సఫలం అయ్యాయి. దీంతో నేటి నుంచి జరగాల్సిన డిగ్రీ 3, 5 సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల డిమాండ్‌తో డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి.

Similar News

News April 20, 2026

మైనర్లకు వాహనాలు ఇచ్చేవారిపై కేసులు.. జాగ్రత్త: SP

image

ప్రకాశం జిల్లా SP మైనర్ డ్రైవింగ్‌పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్లలోపు వారికి వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని, పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదుచేసి జరిమానాలు, జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు తెలియక వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తోందన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని SP సూచించారు.

News April 20, 2026

ముంబై మళ్లీ గెలుపుబాట పడుతుందా?

image

IPL: మొదటి మ్యాచ్ తర్వాత మళ్లీ గెలుపు రుచి చూడని ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న MI ఈ మ్యాచ్‌తోనైనా మళ్లీ గెలుపుబాట పట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో ఉన్న GT అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. ఈ జట్లు IPLలో ఎనిమిదిసార్లు తలపడగా GT ఐదుసార్లు గెలిచింది. ఈరోజు రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

News April 20, 2026

GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

image

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా