News November 11, 2024

పేజర్లతో దాడిని అంగీకరించిన నెతన్యాహు!

image

లెబనాన్‌లో పేజర్ల ద్వారా దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్‌లో జరిగిన ఈ పేలుళ్లలో దాదాపు 40 మంది హెజ్బొల్లా సభ్యులు మరణించారు. ఈ ఘటనపై యునైటెడ్ నేషన్స్ లేబర్ ఏజెన్సీకి లెబనాన్ ఫిర్యాదు చేసింది. మానవత్వంపై ఘోరమైన దాడిగా పేర్కొంది.

Similar News

News December 6, 2024

MSPతోనే పంటల కొనుగోలు: కేంద్రం

image

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను MSPతో కొనేందుకు మోదీ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో తెలిపారు. 2019 నుంచి పంట ఉత్ప‌త్తుల‌ ఖ‌ర్చులో 50% రైతుల‌కు లాభం చేకూర్చేలా MSPని లెక్కిస్తున్నామ‌ని తెలిపారు. రుణ‌మాఫీ అవ‌స‌రం లేకుండా రైతుల ఆదాయం పెంపు, న‌ష్టాల స‌మ‌యంలో ప‌రిహారం వంటి చ‌ర్య‌ల‌తో ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే రైతులు MSPకి చట్టబద్ధత డిమాండ్ చేస్తున్నారు.

News December 6, 2024

12వేల ఏళ్ల క్రితమే కుక్కలతో మనిషి బంధం: అధ్యయనం

image

కుక్కలు, మనుషుల మధ్య బంధం 12వేల ఏళ్ల క్రితమే ఉందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అలాస్కాలో లభించిన 12వేల ఏళ్ల నాటి కుక్కల కాలి ఎముకలపై వారు అధ్యయనం నిర్వహించారు. వాటి ఎముకల్లో సాల్మన్ చేప ప్రొటీన్లు లభ్యమయ్యాయి. నాటి కుక్కలు భూమిపైనే వేటాడేవి తప్పితే సాల్మన్ చేపల్ని పట్టుకోవడం కష్టమని.. కచ్చితంగా అవి మనుషులతో కలిసి జీవించినవేనని పరిశోధకులు తేల్చారు.

News December 6, 2024

పెళ్లికి ముందే ఈ ప‌రీక్ష‌లు అవ‌స‌రం!

image

ప్రాణాంతక త‌ల‌సేమియా వ్యాధి నుంచి పిల్ల‌ల్ని ర‌క్షించ‌డానికి పెళ్లికి ముందే కాబోయే దంపతులు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. దేశంలో 4 కోట్ల మంది ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు! త‌ల్లిదండ్రులిద్ద‌రికీ ఈ సమస్యలుంటే పిల్ల‌ల‌కూ సంక్ర‌మించే అవ‌కాశం ఎక్కువ‌ని చెబుతున్నారు. మేనరిక వివాహాల వల్ల అత్యధికంగా సంక్రమించే ఈ వ్యాధి నుంచి పిల్లల రక్షణకు పెళ్లికి ముందే పరీక్షలు అవసరమని చెబుతున్నారు.