News May 25, 2024
నెట్‌ఫ్లిక్స్: ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన సినిమాలివే!

గత ఏడాది జులై- డిసెంబర్ మధ్య నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో మూవీలు, సిరీస్‌లకు బిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చినట్లు సంస్థ తెలిపింది. జానే జాన్ సినిమా అత్యధికంగా 20.2M వ్యూస్ సాధించగా, ఆ తర్వాత జవాన్(16.2M), కుఫియా(12.1M), OMG-2(11.5M), లస్ట్ స్టోరీస్-2(9.2M) ఉన్నాయని పేర్కొంది. సిరీస్‌లలో ది రైల్వే మెన్ 10.6M వ్యూస్‌తో టాప్‌లో ఉండగా, ఆ తర్వాత కొహ్రా(6.4M), గన్& గులాబ్స్(6.4), కాలా పానీ(5.8M) ఉన్నాయంది.
Similar News
News February 12, 2025
NGKL: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

లింగాల మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన పిట్టల ఆంజనేయులు(30) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాలిలా.. మానాజిపేట నుంచి వల్లభాపుర్‌కు బైక్‌పై వస్తుండగా మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడని, మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 12, 2025
తగ్గిన బంగారం ధర

కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.86,670కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది.
News February 12, 2025
బర్డ్ ఫ్లూ అంటే?

బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఫ్లూ) పక్షుల్లో H5N1 వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది 1996లో చైనాలో ఉద్భవించింది. వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 954 మందికి సోకగా, 464మంది మరణించారు. ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి స్పష్టమైన ఆధారాల్లేవు. వైరస్ సోకిన పక్షులతో సన్నిహితంగా, ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.