News October 20, 2024
అమెరికన్ల అప్పులపై నెటిజన్ ట్వీట్.. మస్క్ రియాక్షన్ ఇదే!
అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఆ దేశ అప్పులను ఎత్తిచూపుతూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. మొత్తం 33 కోట్ల మంది అమెరికన్లతో వడ్డీని విభజించి ప్రతిఒక్కరూ $3,593 చెల్లించాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ విషయంపై మరింత చర్చ జరగాలని పేర్కొంటూ దీనిని షేర్ చేశారు. మన డబ్బులన్నీ ఇంట్రెస్టులు కట్టడానికే వెళ్తున్నాయా? అని అమెరికన్లు విమర్శలు చేస్తున్నారు.
Similar News
News November 7, 2024
ఈ నెల 19, 20న ఆర్టీసీ ఈయూ నిరసనలు
AP: ఉద్యోగ భద్రత సర్క్యులర్ యథావిధిగా అమలు చేయడంతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నిరసనలు చేపట్టనుంది. ఈ నెల 19, 20న ప్రొటెస్ట్ చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని సూచించింది. ఆర్టీసీ డిపోలు, వర్క్ షాప్‌ల వద్ద ధర్నాలు చేయాలని ఉద్యోగులకు సూచించింది.
News November 7, 2024
కాంగ్రెస్ పతనానికి 3 కారణాలు చెప్పిన సింధియా
కాంగ్రెస్ పార్టీ వేగంగా పతనమవుతోందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ‘ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పట్టు తప్పింది. ఇందుకు 3 కారణాలు ఉన్నాయి. ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం మొదటిది. ప్రజలతో సంబంధాలు తెగిపోవడం రెండోది. భారతదేశ విజన్‌కు దూరమవ్వడం మూడోది. ఈ మూడూ లేనప్పుడు పార్టీని ప్రజలు నమ్మడం మానేస్తారు. ప్రస్తుతం దాని దుస్థితి ఇదే’ అని అన్నారు. 2020లో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు.
News November 7, 2024
INDvsSA: టీ20 ట్రోఫీ ఇదే
సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా రేపు రాత్రి 8.30గంటలకు మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీ ఆవిష్కరించారు. ఇద్దరూ కలిసి ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడి టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ ఈ టీ20 సిరీస్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.