News January 11, 2025
మరో పేషెంట్‌లో న్యూరాలింక్ చిప్ అమరిక విజయవంతం

ఎలాన్ మస్క్ సంస్థ న్యూరాలింక్ తయారుచేసిన చిప్‌ను మరో రోగి మెదడులో వైద్యులు విజయవంతంగా అమర్చగలిగారు. మస్క్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఇప్పటి వరకూ ముగ్గురిలో చిప్‌ను విజయవంతంగా అమర్చాం. అందరిలోనూ చిప్స్ బాగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. శరీరంపై నియంత్రణ కోల్పోయిన వారి మెదడులో చిప్ అమర్చి, దాని సాయంతో వారు ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించగలిగేలా న్యూరాలింక్ చిప్ పనిచేస్తుంది.
Similar News
News November 15, 2025
HOCLలో 72 పోస్టులు

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్ (HOCL)72 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ, BSc, డిప్లొమా, ITI అర్హతగల అభ్యర్థులు ఈనెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్‌లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: www.hoclindia.com/
News November 15, 2025
లక్నోకు అర్జున్, షమీ.. DCకి నితీశ్ రాణా

ఐపీఎల్ రిటెన్షన్ గడువు నేటితో ముగుస్తుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ట్రేడ్ చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ నుంచి సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ లక్నోకు వెళ్లారు. సన్‌రైజర్స్ బౌలర్ షమీ కూడా LSG జట్టులో చేరారు. అటు రాజస్థాన్ రాయల్స్‌ను వీడిన నితీశ్ రాణా ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరారు. KKR ప్లేయర్ మయాంక్ మార్కండేను ముంబై ట్రేడ్ చేసుకుంది.
News November 15, 2025
సెంచరీ కోసం నిరీక్షణ! అప్పుడు విరాట్.. ఇప్పుడు బాబర్

2019 నవంబర్ 23న సెంచరీ చేసిన విరాట్.. మరో సెంచరీ కోసం దాదాపు రెండున్నరేళ్లు నిరీక్షించారు. 2022, సెప్టెంబర్ 8న అఫ్గానిస్థాన్‌పై శతకదాహం తీర్చుకున్నారు. తాజాగా పాకిస్థానీ బ్యాటర్ బాబర్ ఆజమ్ అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. 2023, ఆగస్టు 30న సెంచరీ చేసిన బాబర్.. 807 రోజుల తర్వాత మరో సెంచరీ చేశారు. నిన్న శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అజేయ సెంచరీ సాధించి సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు తెరదించారు.


