News September 24, 2024
ఇంతకు ముందెన్నడూ చూడని ప్రో అమెరికన్ పీఎం మోదీ: US రాయబారి
నరేంద్రమోదీ, జో బైడెన్ మధ్య క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉందని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ అన్నారు. 2 దేశాల్లోని ప్రజలకు వారిద్దరూ ప్రతినిధులని పేర్కొన్నారు. ‘భారత చరిత్రలోనే మోదీలాంటి ప్రో అమెరికన్ పీఎంను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఇక అమెరికా చరిత్రలో అత్యంత ప్రో ఇండియన్ ప్రెసిడెంట్ బైడెన్’ అంటూ ఆయన వర్ణించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి సమస్యల పరిష్కారానికే క్వాడ్ ఉందన్నారు.
Similar News
News October 10, 2024
శాంతి, స్థిరత్వంపై ASEAN దేశాలతో చర్చిస్తా: మోదీ
ASEAN దేశాలతో భారత్ బంధం మరింత బలపడుతుందని PM మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కోఆపరేషన్ ఫ్యూచర్ దిశ, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై అక్కడి లీడర్లతో చర్చిస్తానని చెప్పారు. ASEAN-India, ఈస్ట్ ఏషియా సదస్సుల కోసం ఉదయం ఆయన లావోస్ బయల్దేరారు. ‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు ఈస్ట్ ఏషియా సదస్సు మంచి అవకాశం. లావో PDR నేతలను కలుస్తాను’ అని మోదీ తెలిపారు.
News October 10, 2024
దేవాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి గుడిలో వైదిక కమిటీని నియమించాలంది. నూతన సేవలు, ఫీజులు, కళ్యాణోత్సవ ముహూర్తాలు వంటి అంశాల్లో కమిటీ సూచనలు అధికారులు పాటించాలంది. కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలంది.
News October 10, 2024
సిండికేట్లకు సహకరిస్తే ఉపేక్షించం: మంత్రి కొల్లు
ఏపీలో మద్యం షాపులను సొంతం చేసుకోవడానికి కొందరు సిండికేట్లుగా ఏర్పడుతున్నారనే ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలకు తావివ్వొద్దని, రాజకీయ ఒత్తిళ్లు తలొగ్గొద్దని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ప్రక్రియ, షాపుల కేటాయింపులు పారదర్శకంగా ఉండాలన్నారు. సిండికేట్లకు సహకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నెల 16నుంచి కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.