News November 18, 2024

RCBకి కొత్త బౌలింగ్ కోచ్.. స్పెషాలిటీ ఇదే!

image

IPL2025 కోసం ఓంకార్ సాల్వీని RCB కొత్త బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ముంబై రంజీ టీమ్‌ హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్నారు. గతంలో KKR సపోర్ట్ స్టాఫ్‌లోనూ పనిచేశారు. ఆయన కోచింగ్‌లోనే ముంబై గత ఏడాది రంజీ, ఇరానీ ట్రోఫీలను గెలిచింది. వచ్చే ఏడాది దేశవాళీ సీజన్ ముగియగానే ఆయన RCBతో కలుస్తారు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని వెలికితీస్తుండటంతో రెండేళ్లుగా డొమెస్టిక్ సర్క్యూట్లో ఆయన పేరు మార్మోగుతోంది.

Similar News

News December 8, 2024

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు

image

AP: భారీ వర్షాలతో ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జేసీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోత కోసిన వరిని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. కోత కోసిన వరిని రక్షించేందుకు టార్పాలిన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వర్షాలు పడే సమయంలో పంట కోత కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

News December 8, 2024

రాముడే సిగ్గుతో త‌ల‌దించుకుంటాడు: ఇల్తిజా

image

రాముడి పేరు నిన‌దించలేద‌న్న కార‌ణంతో ముస్లిం యువ‌కుల‌ను హింసించ‌డం లాంటి ఘ‌ట‌న‌ల‌తో రాముడే సిగ్గుతో త‌ల‌దించుకుంటాడ‌ని PDP నాయ‌కురాలు ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జరిగిన ఈ ఘ‌ట‌న‌పై ఆమె స్పందిస్తూ ఇలాంటి స‌మ‌యాల్లో రాముడు సైతం నిస్స‌హాయంగా ఉండిపోతార‌ని పేర్కొన్నారు. దేవుడి పేరును చెడ‌గొడుతూ ల‌క్ష‌లాది మంది భార‌తీయుల‌ను ప‌ట్టిపీడిస్తున్న రోగం హిందుత్వమని అన్నారు.

News December 8, 2024

భారీ వర్షాలు.. రైతులకు హెచ్చరిక

image

AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని తెలిపింది. కోసినా పూర్తిగా ఆరని వాటిని కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేస్తే నష్ట శాతం నివారించవచ్చంది.