News March 8, 2025
తెలంగాణలో కొత్త ESI డిస్పెన్సరీలు

తెలంగాణలో పలు జిల్లాలకు ESIC డిస్పెన్సరీలు మంజూరు చేసింది. మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, హనుమకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. కొత్తగా 20 డిస్పెన్సరీలు అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించి ప్రతిపాదనలు రూపొందించారు. తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాక ఆర్థిక శాఖ అనుమతితో జీవో జారీ కానుంది.
Similar News
News March 23, 2025
వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం: సోము వీర్రాజు

AP: 60 సీట్లు వచ్చినప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్లలేదని, ఇప్పుడు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలంటున్నారని BJP MLC సోము వీర్రాజు విమర్శించారు. YCPని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమని, ఆ పార్టీకి 20% ఓట్లు కూడా రాకుండా చేస్తామని పేర్కొన్నారు. జగన్‌కు మళ్లీ అధికారమిస్తే అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మాట్లాడుతూ కార్మిక సంఘాల నాయకుల వల్లే అది నష్టపోయిందని ఆరోపించారు.
News March 23, 2025
SRHvsRR: జట్లు ఇవే

SRH: హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్, అభినవ్, అనికేత్, కమిన్స్, సిమర్‌జీత్, హర్షల్, షమీ
RR: జైస్వాల్, రాణా, జురెల్, పరాగ్, హెట్‌మెయిర్, శుభమ్ దూబే, జోఫ్రా, తీక్షణ, సందీప్, తుషార్ దేశ్‌పాండే, ఫరూఖీ
News March 23, 2025
SRHvRR: టాస్ గెలిచిన RR

ఉప్పల్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో SRH ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.