News April 8, 2025

త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్

image

వాట్సాప్ ప్లాట్‌ఫామ్ త్వరలోనే కొత్త సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో చాటింగ్, షేర్ చేసిన వీడియోస్, ఫోటోలు రిసీవర్ సేవ్ చేసుకునే అవకాశం లేకుండా కొత్త ఫీచర్ డెవలప్ చేస్తుంది. దీంతో మన వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. అయితే స్క్రీన్‌ రికార్డింగ్, స్క్రీన్‌షాట్‌ల ద్వారా సేవ్ చేసే విషయం‌పై స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం IOSయూజర్స్ కోసం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు.

Similar News

News April 17, 2025

రేపు హాల్ టికెట్లు విడుదల

image

AP: పలు ఉద్యోగ పరీక్షల హాల్‌టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు APPSC ప్రకటించింది. అభ్యర్థులు https://psc.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఈ నెల 28న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ జాబ్స్‌కు 28, 29న పరీక్షలు జరుగుతాయి. ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 28న పేపర్-1, 30న పేపర్-2, పేపర్-3 ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

News April 17, 2025

జేఈఈ మెయిన్ ఫైనల్ ‘కీ’ విడుదల

image

జేఈఈ మెయిన్ సెషన్ 2 <>ఫైనల్ కీ<<>> విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు సెషన్ 2 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.

News April 17, 2025

ఆలయాలలోని 1000కేజీల బంగారం కరిగింపు.. ఎక్కడంటే?

image

తమిళనాడులోని 21దేవాలయాలలో భక్తులు సమర్పించిన 1000 KGల బంగారు ఆభరణాలను కరిగించినట్లు అధికారులు తెలిపారు. వాటిని 24 క్యారెట్ల కడ్డీలుగా మార్చి SBIలో డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.17.81కోట్ల వడ్డీ రానుండగా, ఆ నిధులతో ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఆలయాలలో నిరుపయోగంగా ఉన్న వెండిని సైతం కరిగించి డిపాజిట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!