News June 13, 2024
వాట్సాప్‌లో చాట్ ట్రాన్స్‌ఫర్ కోసం కొత్త ఫీచర్!

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘ట్రాన్స్‌ఫర్ చాట్ హిస్టరీ’ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. దీని ద్వారా యూజర్లు గూగుల్ డ్రైవ్‌ను యూజ్ చేయకుండానే పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కి చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యాప్ సెట్టింగ్స్‌లో QR కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉండగా, త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
Similar News
News March 22, 2025
ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకల్లో తారలు వీరే

ఈరోజు సాయంత్రం ఆరింటికి IPL ఓపెనింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. వీటిలో బాలీవుడ్ తారల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. నటీనటులు దిశా పటానీ, శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ డాన్సులు, శ్రేయా ఘోషల్, అర్జీత్ సింగ్ పాటలు, పంజాబీ ఆర్టిస్ట్ కరణ్ ఔజ్లా ర్యాప్ ఆరంభోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇక 7.30 గంటలకు KKR, RCB మధ్య మ్యాచ్ మొదలుకానుంది.
News March 22, 2025
రేపు, ఎల్లుండి వర్షాలు

TG: నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఇవాళ బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈరోజు రాత్రి వరకు కొన్ని చోట్ల వాన పడుతుందని పేర్కొంది.
News March 22, 2025
డీలిమిటేషన్ అమలైతే మనల్ని ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తారు: CM రేవంత్

TG: డీలిమిటేషన్ విషయంలో BJPని అడ్డుకోవాలని CM రేవంత్ అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. ‘జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల స్వరం వినిపించదు. మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారు. మనవద్దే అభివృద్ధి ఎక్కువ. అయినప్పటికీ నిధుల్లో వివక్ష చూపిస్తున్నారు. రూపాయి పన్ను కట్టే తెలంగాణకు 42 పైసలే ఇస్తున్నారు. కానీ బిహార్‌కు రూపాయికి రూ. ఆరు ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు.