News May 19, 2024
వాట్సాప్లో కొత్త ఫీచర్లు
వాట్సాప్లో ‘Pinned message preview’, ‘Description for community group chats’ అనే ఫీచర్లు రానున్నాయి. ‘పిన్నెడ్ మెసేజ్ ప్రివ్యూ’తో చాట్లో యూజర్లు తాము పిన్ చేసిన మీడియా ఫైల్ను ఓపెన్ చేయకుండానే చూసే వీలుంటుంది. అంటే పిన్ చేసిన దగ్గరే థంబ్నైల్ రూపంలో ప్రివ్యూ కనిపిస్తుంది. ఇక ‘డిస్క్రిప్షన్ ఫర్ కమ్యూనిటీ గ్రూప్ చాట్స్’ ఫీచర్తో కమ్యూనిటీ గ్రూపుల్లో అడ్మిన్స్ తమ గ్రూప్ వివరాల్ని యాడ్ చేసుకోవచ్చు.
Similar News
News December 23, 2024
శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 77,260 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24,223 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.
News December 23, 2024
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదు: మంత్రి
TG: సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన <<14952214>>దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని కోరారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు.
News December 23, 2024
పెట్రోల్ పంపులో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి
TG: దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డు వద్ద ఓ ప్రత్యేక పెట్రోల్ పంపును ఏర్పాటు చేసి 24 మందికి ఉపాధినిచ్చింది. 24/7 పనిచేసే ఈ పంపులో రోజుకు ₹లక్ష విలువైన ఇంధనం సేల్ అవుతోంది. దేశంలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల కోసం పెట్రోల్ పంపు ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.