News May 19, 2024

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు

image

వాట్సాప్‌లో ‘Pinned message preview’, ‘Description for community group chats’ అనే ఫీచర్లు రానున్నాయి. ‘పిన్నెడ్ మెసేజ్ ప్రివ్యూ’తో చాట్‌లో యూజర్లు తాము పిన్ చేసిన మీడియా ఫైల్‌ను ఓపెన్ చేయకుండానే చూసే వీలుంటుంది. అంటే పిన్ చేసిన దగ్గరే థంబ్‌నైల్ రూపంలో ప్రివ్యూ కనిపిస్తుంది. ఇక ‘డిస్క్రిప్షన్ ఫర్ కమ్యూనిటీ గ్రూప్ చాట్స్’ ఫీచర్‌తో కమ్యూనిటీ గ్రూపుల్లో అడ్మిన్స్ తమ గ్రూప్ వివరాల్ని యాడ్ చేసుకోవచ్చు.

Similar News

News December 6, 2024

గ్రూప్-1,2,3 ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలో గ్రూప్-1, 3 పరీక్షలు జరగ్గా, ఈ నెలలో గ్రూప్-2 నిర్వహించనున్నారు. తొలుత గ్రూప్-1 ఫలితాలు, పోస్టుల భర్తీ.. ఆ తర్వాత గ్రూప్-2 ఫలితాలు, భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. చివర్లో గ్రూప్-3 ఫలితాలు రిలీజ్ చేస్తారని సమాచారం. ఇలా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అన్ని గ్రూప్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. మెరిట్ ఉన్న నిరుద్యోగులు అవకాశాలు కోల్పోకూడదని TGPSC ఇలా కొత్త విధానం అమలు చేయనున్నట్లు సమాచారం.

News December 6, 2024

FLASH: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

image

అడిలైడ్ వేదికగా AUSతో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. పడిక్కల్, సుందర్, జురెల్ స్థానాల్లో గిల్, రోహిత్, అశ్విన్ ఎంట్రీ ఇచ్చారు.
IND: జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లీ, పంత్, రోహిత్, నితీశ్ రెడ్డి, అశ్విన్, హర్షిత్ రాణా, బుమ్రా, సిరాజ్
AUS: ఖవాజా, నాథన్, లబుషేన్, స్టీవెన్ స్మిత్, హెడ్, మార్ష్, అలెక్స్, కమిన్స్, మిచెల్ స్టార్క్, లియోన్, బోలాండ్

News December 6, 2024

రాత్రి జీన్స్ ప్యాంట్ వేసుకునే నిద్రిస్తున్నారా?

image

కొందరు రాత్రి వేళల్లో జీన్స్ ప్యాంట్ ధరించే నిద్రపోతారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట వీటిని ధరిస్తే కంఫర్ట్ లేక సరిగ్గా నిద్రపట్టదు. శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రాభంగం కలుగుతుంది. జీన్స్ బిగుతుగా ఉండటంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలర్జీ, దద్దుర్లు, నడుం నొప్పి, ఉబ్బరం, లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. రాత్రి వీటిని ధరించకపోవడం బెటర్.