News July 16, 2024

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు?

image

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు ఫీజులు మారనున్నాయి. దీనికి సంబంధించిన తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(TAFRC) ప్రకటన చేసే అవకాశం ఉంది. నిన్న జరిగిన సమావేశంలో 2025-28 విద్యా సంవత్సరాల ఫీజులపై చర్చించారు. త్వరలోనే ఆయా కాలేజీలు ఎంత ఫీజు కోరుకుంటున్నాయనే వివరాలను మేనేజ్మెంట్ల నుంచి స్వీకరించనున్నారు. వాటి ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయనున్నారు.

Similar News

News October 16, 2024

ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

image

దాదాపు రెండేళ్లుగా ఇద్దరు స్టార్లు బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఎట్టకేలకు వీరి సినిమాలు రిలీజ్ కానుండటంతో అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ (JAN 10), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో ‘పుష్ప-2’ (DEC 6) సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాల నుంచి సాంగ్స్, టీజర్స్ విడుదలయ్యాయి. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.

News October 16, 2024

సింగిల్ టేక్‌లో 11 నిమిషాల సీన్: వరుణ్ ధవన్

image

వరుణ్ ధవన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ‘సిటాడెల్’. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశాన్ని 11 నిమిషాల పాటు సింగిల్ టేక్‌లో చేసినట్లు వరుణ్ వెల్లడించారు. ఇది సిరీస్ క్లైమాక్స్‌లో రానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇది నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో అందుబాటులో ఉండనుంది.

News October 16, 2024

ఐఏఎస్‌ల పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ

image

TG: క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్‌లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.30గంటలకు వాదనలు విననుంది. ఏపీకి వెళ్లాలంటూ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్‌ను క్యాట్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.