News December 28, 2024
ఓటీటీలోకి కొత్త చిత్రం
కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ‘గ్రాండ్ పిక్స్’ అవార్డును పొందిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ మూవీ OTTలోకి రానుంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ ఫీచర్ ఫిల్మ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో JAN 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముంబై నర్సింగ్ హోమ్‌లో పనిచేసే ఇద్దరు నర్సుల కథే ఈ చిత్రం. కశ్రుతి, దివ్య ప్రధాన పాత్రల్లో నటించారు. US మాజీ అధ్యక్షుడు ఒబామా మెచ్చిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్‌నూ పొందింది.
Similar News
News January 16, 2025
ఫిబ్రవరి 14 నుంచి WPL ప్రారంభం
వచ్చే నెల 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ప్రారంభం కానున్నట్లు BCCI ప్రకటించింది. బరోడా వేదికగా బెంగళూరు-గుజరాత్ మధ్య తొలి మ్యాచ్‌తో సమరానికి తెర లేవనుంది. మొత్తం 5 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్లో 22 మ్యాచ్‌లు జరుగుతాయి. బరోడాతో పాటు బెంగళూరు, లక్నో, ముంబైని వేదికలుగా ఖరారు చేశారు. మార్చి 15న ముంబైలో ఫైనల్ జరగనుంది. పూర్తి షెడ్యూల్‌ను పైన ఫొటోల్లో చూడొచ్చు.
News January 16, 2025
తల్లి కాదు రాక్షసి.. ఫాలోవర్లు, డబ్బు కోసం కూతురిని..
సోషల్ మీడియాలో ఫాలోవర్లు, డబ్బుల కోసం ఆస్ట్రేలియాలో ఓ మహిళ (34) దారుణానికి పాల్పడింది. ఏడాది వయసున్న కూతురికి అనవసర ఔషధాలను ఇచ్చి అనారోగ్యానికి గురయ్యేలా చేసింది. చిన్నారి పడే బాధను ఫొటోలు, వీడియోల రూపంలో టిక్‌టాక్‌లో పోస్టు చేసి విరాళంగా $37,300ను పొందింది. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్చగా అసలు విషయం బయటపడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
News January 16, 2025
‘తండేల్’ నుంచి రేపు మరో అప్డేట్
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ నుంచి రేపు మరో అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. మట్టికుండపై ఏదో వండుతున్నట్లుగా ఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరో రుచికరమైనది రేపు ఉదయం 11.07 గంటలకు మీకు అందిస్తామని రాసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.