News October 20, 2024
టీడీపీలో కొత్తగా పంచ సభ్య కమిటీ?
AP: ఎమ్మెల్యేల పనితీరుని పర్యవేక్షించడానికి పంచ సభ్య కమిటీ వేస్తున్నట్లు CM చంద్రబాబు ప్రకటించినట్లు తెలుస్తోంది. ‘MLAలు చేస్తున్న తప్పులను ఈ కమిటీ గమనిస్తుంటుంది. పంచ సభ్య కమిటీ చెప్పిన తర్వాత కూడా తీరు మారకపోతే నేను పిలవాల్సి ఉంటుంది. అయినా మార్పు రాకపోతే తీవ్ర చర్యలు ఉంటాయి. కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్లు అందరికీ ఇది వర్తిస్తుంది’ అని నేతలతో సమావేశంలో CBN చెప్పినట్లు సమాచారం.
Similar News
News November 14, 2024
ప్రపంచంలోనే అత్యంత చిన్న పిల్లులివే!
పిల్లులను పెంచుకునేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఇవి ఇంట్లోవారితో ఫ్రెండ్లీగా ఉంటుంటాయి. అయితే చేతిలో ఇమిడిపోయేటంతటి పిల్లులూ ఒకప్పుడు ఉన్నాయి. ఇల్లినాయిస్‌కు చెందిన టింకర్ టాయ్ అనే పిల్లి 2.75 అంగుళాల ఎత్తు, 7.5 అంగుళాల పొడవు మాత్రమే ఉండేది. మిస్టర్ పీబల్స్(ఇల్లినాయిస్) పిల్లి 3.1 పౌండ్లు, 6.1 అంగుళాల పొడవు మాత్రమే. ఈ రెండు అత్యంత చిన్న పిల్లులుగా గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాయి.
News November 14, 2024
గ్రూప్-4 రిజల్ట్స్ ఇవ్వాల్సిందే.. అభ్యర్థుల డిమాండ్
TG: గ్రూప్-4లో అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకుండా ఫలితాలు విడుదల చేయొద్దని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తుండగా మరికొందరు వెంటనే రిజల్ట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇస్తే ఫలితాలు ఆలస్యం అవుతాయని, అది కోరేవారు కొంతమందే ఉన్నారని చెబుతున్నారు. రెండేళ్లుగా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నామంటున్నారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఫలితాలు ఇవ్వాల్సిందేనని TGPSCని కోరుతున్నారు.
News November 14, 2024
సింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి: సజ్జనార్
ఆర్టీసీ బస్సులో పాట పాడి వైరలయిన <<14578057>>దివ్యాంగ సింగర్<<>>ను TGSRTC ఎండీ సజ్జనార్ కలిసి అభినందించారు. ‘దృఢమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం ఏ మాత్రం అడ్డుకాదని గాయకుడు రాజు నిరూపిస్తున్నారు. మధురమైన గాత్రమే కాదు.. పాటకు అనుగుణంగా ఎలాంటి వాయిద్యాల్లేకుండా తన చేతులు, కాళ్లతో సంగీతాన్ని అందిస్తోన్న ఈయన ప్రతిభ అద్భుతం. ఎంతో మంది యువతకు రాజు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం’ అని పేర్కొన్నారు.