News August 12, 2024
టీచర్ల సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు
AP: టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్నవారిని తొలుత మండల స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. ఈ నెల 14వ తేదీకి ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఉద్యోగంలో చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని నిర్ణయించనున్నారు. అర్హత ఉన్న SGTలను సబ్జెక్టు టీచర్లుగా హైస్కూళ్లలో నియమిస్తారు.
Similar News
News September 10, 2024
వరద బాధితులకు త్వరలో నష్టపరిహారం: మంత్రి నారాయణ
AP: విజయవాడ వరద బాధితులకు త్వరలో నష్టపరిహారం అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తాజాగా వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గుతుందన్నారు. 1.7లక్షల మందికి నిత్యావసర సరుకులు అందించామని, ఆస్తి నష్టంపై సర్వే జరుగుతోందని చెప్పారు.
News September 10, 2024
ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే వేదికపైకి తారక్, అల్లు అర్జున్?
ఈరోజు జరిగే ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారనే చర్చ నడుస్తోంది. తారక్, బన్ని ‘బావ’ అని ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ ఈవెంట్‌కు బన్ని రానున్నారని సమాచారం. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. పాటలు హిట్ అయిన తరుణంలో ట్రైలర్‌పైనా భారీ అంచనాలున్నాయి.
News September 10, 2024
బిల్లులు క్లియర్ చేయండి: యూనస్‌కు అదానీ లేఖ
బంగ్లా పవర్ బోర్డు నుంచి రావాల్సిన $800 మిలియన్ల బకాయిలను త్వరగా ఇప్పించాలని ఆ దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్‌ను అదానీ పవర్ కోరింది. ఈ అంశంలో జోక్యం చేసుకొని బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని లేఖ రాసింది. ఝార్ఖండ్ ప్లాంట్ నుంచి అదానీ కంపెనీ బంగ్లాకు విద్యుత్ సరఫరా చేస్తోంది. నెలకు $90-95 మిలియన్లు తీసుకుంటుంది. కొన్ని నెలలుగా అందులో సగం వరకే చెల్లిస్తుండటంతో బకాయిలు పేరుకుపోయాయి.