News August 5, 2024
రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి: డిప్యూటీ సీఎం భట్టి
TG: రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.లక్షన్నర వరకూ రుణమాఫీ చేశామన్నారు. బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెద్ద మొత్తంలో రికవరీ జరిగిందని, దీని వల్ల బ్యాంకర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. సహకార బ్యాంకుల్లో రుణమాఫీ విషయంలో వచ్చిన ఇబ్బందులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News September 16, 2024
వివ్ రిచర్డ్స్‌తో తల్లి సంబంధం వల్ల వేధింపులు ఎదుర్కొన్నా: మసాబా గుప్తా
విండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో తన తల్లికి ఉన్న సంబంధం వల్ల 7వ తరగతిలోనే వేధింపులకు గురైనట్టు నేనా గుప్తా కుమార్తె మసాబా గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి గర్భం దాల్చినప్పుడు తనది అక్రమ సంతానంగా భావిస్తూ నేనా గుప్తా తల్లిదండ్రులు ఎవరూ చూట్టూ లేరని, తన తండ్రి రిచర్డ్స్ కూడా లేరన్నారు. తాను శారీరకంగా ఎలా ఉన్నది, లేదా ఎందుకలా ఉన్నది కూడా చాలా మందికి అర్థం కాలేదన్నారు.
News September 16, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు వర్షం కురవనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
News September 16, 2024
వేలానికి పీఎం మోదీ గిఫ్టులు
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన గిఫ్టులను వేలం వేయనున్నట్లు కేంద్రం తెలిపింది. వివిధ సందర్భాల్లో దేశ, విదేశాల అతిథులు ఇచ్చిన బహుమతులు, జ్ఞాపికలను ఆక్షన్‌లో ఉంచనున్నట్లు పేర్కొంది. మొత్తం 600 వస్తువులు వేలం వేస్తారు. వీటన్నింటి విలువ దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. రేపటి నుంచి వచ్చే నెల 2 వరకు ఈ వేలాన్ని కొనసాగిస్తారు. సేకరించిన నిధులను జాతీయ గంగా నిధికి అందిస్తారు.