News March 12, 2025
OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా

ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా’ థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మార్చి 26వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియో హాట్‌స్టార్ వెల్లడించింది. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగులో అందుబాటులోకి రానుంది. తెలుగులో ముఫాసాకు మహేశ్ బాబు వాయిస్ ఇచ్చారు.
Similar News
News April 17, 2026
ఉమెన్ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకెందుకు: థరూర్

మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా LSలో ప్రస్తుత సభ్యుల సంఖ్యను అనుసరించి అమలు చేయాలని INC MP శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘డీలిమిటేషన్ తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు. LS సభ్యుల సంఖ్యను 850కి పెంచడం ప్రపంచంలో గొప్పదంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 123 రోజులు జరిగితే ఇప్పుడు 60డేస్‌కు కుదించారు’ అని విమర్శించారు.
News April 17, 2026
ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.
News April 17, 2026
జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

YCP చీఫ్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ మధ్య 2 వారాలు యూరప్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కావాలంది. పర్యటన వివరాలు కోర్టు, CBIకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


