News March 2, 2025

ఓటీటీలోకి కొత్త సినిమా

image

అజిత్, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విదాముయార్చి’(పట్టుదల) రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మగిజ్ తిరుమేని తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన నాలుగు వారాల్లోనే ఈ చిత్రం OTTలోకి రానుంది.

Similar News

News March 19, 2025

అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే!

image

దాదాపు 9 నెలల తర్వాత ISS నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్‌పై ప్రపంచం దృష్టి నెలకొంది. కాగా అంతరిక్షంలో ఒకే ప్రయాణంలో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తుల్లో వాలేరి పోలికోవ్(రష్యా-437 డేస్) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఫ్రాంక్ రుబియో(US-371d), మార్క్ వాండె(355), స్కాట్ కెల్లీ(340) ఉన్నారు. సునీత, విల్మోర్ తలో 286 డేస్ అంతరిక్షంలో ఉన్నారు. కాగా సునీత తన మూడు ప్రయాణాల్లో 608 రోజులు రోదసిలో ఉన్నారు.

News March 19, 2025

ఇంకోసారి అలా అనొద్దు.. ABDకి కోహ్లీ సూచన

image

ఐపీఎల్-2025కి ముందు ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఈసాల కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) నినాదాన్ని ఇకపై పబ్లిక్‌లో వాడొద్దని కోహ్లీ తనకు మెసేజ్ చేసినట్లు తెలిపారు. ‘వరల్డ్ కప్‌ను ఈజీగా గెలవచ్చేమో కానీ ఐపీఎల్ ట్రోఫీని గెలవడం అంత సులభం కాదు. ఈ టోర్నీ చాలా కఠినతరంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. 2011-21 మధ్య ABD ఆర్సీబీకి ఆడిన సంగతి తెలిసిందే.

News March 19, 2025

సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డు బియ్యం కూడా ఇవ్వలేదు: KTR

image

TG: సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని KTR విమర్శించారు. ‘మార్చి నుంచి సన్నబియ్యం ఇస్తామన్న ప్రభుత్వం పదో తేదీ దాటినా రేషన్ బియ్యం ఇవ్వలేదు. సన్నబియ్యం కోసం చూస్తే కనీసం దొడ్డు బియ్యం కూడా రాలేదు. లక్ష 54 వేల మెట్రిక్ టన్నులకు గాను రేషన్ దుకాణాలకు కేవలం 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసింది’ అని ట్వీట్ చేశారు. మీకు ఈనెల రేషన్ వచ్చిందా? COMMENT.

error: Content is protected !!