News November 11, 2024
15న ఓటీటీలోకి కొత్త చిత్రం

సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ నెల 15 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాలో సాయిచంద్, షాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 11న <<14329220>>విడుదలైన<<>> ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
Similar News
News March 5, 2026
ప్రపంచంలో రద్దీగా ఉండే జలసంధులు ఇవే..

వివిధ ఖండాల మధ్య ఉన్న జలసంధుల ద్వారా చమురు రవాణా సాగుతుంటుంది. ఇందులో మలక్కా జలసంధి అతి ముఖ్యమైనది. ఇండోనేషియా దీవుల్లో ఉండే ఈ సంధి ద్వారా రోజుకు 23.2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ సరఫరా అవుతుంది. ఆ తర్వాత ఇరాన్ దగ్గరలోని హార్ముజ్ (20.9 M), సౌతాఫ్రికా కింద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ (9.1 M), ఈజిప్ట్ సూయిజ్ కెనాల్ (4.9 M), డానిష్ సంధి (4.9 M) ఉన్నాయి. తాజా యుద్ధంతో హార్ముజ్‌ను మూసివేశారు.
News March 5, 2026
హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

HYDలోని<
News March 5, 2026
రాజ్యసభ అభ్యర్థి నితీశ్ కుమార్ నామినేషన్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం షా సమక్షంలో నితీశ్ నామినేషన్ ఫైల్ చేశారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే మార్చి 16 వరకు ఆయన సీఎం పదవిలో ఉంటారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.


