News August 3, 2024
త్వరలో కొత్త NCA ఓపెనింగ్: జైషా

బెంగళూరులో నిర్మిస్తోన్న కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీని త్వరలోనే ప్రారంభించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించారు. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. ఇందులో 3 వరల్డ్ క్లాస్ ప్లేయింగ్ గ్రౌండ్స్, 45 ప్రాక్టీస్ పిచ్‌లు, ఇండోర్ క్రికెట్ పిచ్‌లు, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయని పేర్కొన్నారు. క్రికెటర్లు తమ స్కిల్స్ మెరుగుపరుచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
Similar News
News December 9, 2025
ఆర్థిక సమస్యలను తొలగించే ‘ద్వార లక్ష్మీ పూజ’

ఇంటి గడపను లక్ష్మీ ద్వారంగా భావించి, దేవతలను ఆహ్వానించడానికి పసుపు, కుంకుమలతో అలంకరిస్తాం. అయితే 16 రోజులు ‘ద్వార లక్ష్మీ పూజ’ ఆచరిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు, జాతక దోషంతో బాధపడుతున్నవారు ఈ పూజ చేయాలని సూచిస్తున్నారు. లక్ష్మీ ద్వార పూజ ఎప్పుడు, ఎలా చేయాలి? పూజా ఫలితాలు తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News December 9, 2025
గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత(2/2)

ప్రతీ రెండు నుంచి మూడేళ్లకు ఒకసారి విత్తన పొట్టేలును మార్చాలి. ఎంపిక చేసుకునే పొట్టేలు దృఢంగా, ఎత్తుగా, చురుకుగా, ఎక్కువ బరువు, అధిక లైంగికాసక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా కవల పిల్లలను కనే సంతతి నుంచి వచ్చిన పొట్టేలును ఎంచుకోవడం చాలా మంచిదని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్లకు పైన వయసున్న పొట్టేలును మాత్రమే ఎంచుకోవాలి. మరింత సమాచారం కోసం వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవాలి.
News December 9, 2025
నేటి నుంచి లారీల బంద్

AP: టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్‌తో ఇవాళ అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేస్తున్నట్లు లారీ ఓనర్ల సంఘం ప్రకటించింది. దాదాపు 10వేల లారీలు నిలిచిపోనుండటంతో కూరగాయలు, నిత్యావసరాలు, ధాన్యం, రేషన్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. 13 ఏళ్ల వాహనాల ఫిట్‌నెస్ ఫీజు గతంలో రూ.1,400 ఉండగా కొత్త నిబంధనల ప్రకారం రూ.33వేలు చెల్లించాల్సి వస్తోందని లారీల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


