News September 27, 2024

నవంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు

image

TG: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం NOV 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను అమల్లోకి తేనుంది. రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం ప్రస్తుతం చ.అడుగు ఫ్లాట్ ధర సగటున రూ.3200 ఉంది. ఇది 30శాతం(రూ.960) మించకుండా ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అయితే సాగు భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న విలువను సవరించి గజం ధర రూ.వెయ్యి ఉంటే దాన్ని రూ.2వేలకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News October 7, 2024

Stock Market: లాభాల్లోనే మొదలయ్యాయ్

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందడంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్ 81962 (274), NSE నిఫ్టీ 25072 (57) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ బ్యాంక్, ఇన్ఫీ, సిప్లా టాప్ గెయినర్స్. టైటాన్, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా టాప్ లూజర్స్. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 26:24గా ఉంది.

News October 7, 2024

కరాచీ ఉగ్రదాడిలో ఇద్దరు చైనీయులు మృతి

image

పాకిస్థాన్ కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన <<14292979>>ఉగ్రదాడిలో<<>> ఇద్దరు చైనీయులు మరణించారు. ఈమేరకు పాక్‌లోని చైనా ఎంబసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు తొలుత దీన్ని ఆత్మాహుతి దాడిగా భావించినా, వాహనంలో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చినట్లు తర్వాత అధికారులు గుర్తించారు. కాగా విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇప్పటికే బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.

News October 7, 2024

40వేల టార్గెట్స్, 4700 టన్నెల్స్‌పై బాంబులేసిన ఇజ్రాయెల్

image

యుద్ధం మొదలయ్యాక 40వేల హమాస్ టార్గెట్స్, 4700 టన్నెల్స్, 1000 రాకెట్ లాంచర్ సైట్లను బాంబులతో నాశనం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 2023 OCT 7 నుంచి 726 మంది తమ సైనికులు మరణించారని తెలిపింది. అదేరోజు 380, మిలిటరీ ఆపరేషన్స్ మొదలయ్యాక మిగిలినవాళ్లు చనిపోయారని పేర్కొంది. 4576 మంది గాయపడ్డారని చెప్పింది. 3 లక్షల రిజర్వు సైనికుల్ని నమోదు చేసుకున్నామని, అందులో 82% మెన్, 18% విమెన్ ఉన్నారని తెలిపింది.